• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ ని ముట్టనంటే...

కమల్ ని ముట్టనంటే ఒప్పుతాడా?

By - Tupaki Desk
Update: 2018-01-30 16:49 GMT
మన దేశంలో సినీ పరిశ్రమ గురించి ఓ పుస్తకం రాస్తే.. అందులో కొన్ని పేజీలు తప్పనిసరిగా కమల్ హాసన్ కు కేటాయించాల్సిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అంతటి ప్రాముఖ్యత కలిగిన కమల్ హాసన్ కు.. తన సినిమాల్లో లిప్ లాక్ చేసే అలవాటు చాలానే ఉంది. ఏ ఎమోషన్ ను అయినా పండించేసే కమల్.. ఎంత వయసు వచ్చినా మూతి ముద్దులు పెడుతూనే ఉంటారు.

ఎవరో కొందరు మినహాయిస్తే దాదాపుగా తనతో నటించిన భామలు అందరికీ ముద్దులు పెట్టేశారాయన. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఓ ప్రాజెక్టు డీటైల్స్ మాత్రం ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం రోబో సీక్వెల్ 2.ఓ రూపొందిస్తున్న ధర్శకుడు శంకర్.. ఆ తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు ఇండికేషన్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు నయనతారను అడిగారట. ఆమె నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాటల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చడానికి మరో ఆరు నెలలకు పైగానే పట్టనుంది. అయితే.. నయనతార గతంలో లిప్ లాక్స్ తో సహా అన్ని సీన్స్ ను బాగానే చేసింది కానీ.. ఈ మధ్య మాత్రం హీరోలతో అంటీముట్టని సీన్స్ కు మాత్రమే యాక్సెప్ట్ చేస్తోంది.

కవ్వించే డ్యాన్సులు.. హీరోలతో క్లోజప్ సన్నివేశాలు చేయనని తెగేసి చెబుతోంది. రీసెంట్ గా జైసింహా మూవీలో ఈ సంగతి గమనించవచ్చు. మరి ముద్దుల విషయంలో ఏ మాత్రం తగ్గని కమల్ కు.. ముట్టుకునేందుకే ఒప్పుకోని నయన్ కు ఎలా పొంతన కుదురుతుందో?
Tags:    
  • Nayanthara 
  • Kamal Haasan 
  • Bhaarateeyudu 2 Movie 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS