• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్ పెళ్లి కాకుండానే...

నయన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా...?

By - Tupaki Desk
Update: 2020-05-13 00:30 GMT
సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. ఆమె సినీ కెరీర్ పక్కన పెడితే ప్రేమాయ‌ణాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికి రెండు సార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న్ ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ప్రేమ‌లో ఉంది. ముందుగా హీరో శింబుతో ప్రేమాయణం సాగించింది ఈ అమ్మడు. కానీ ఆ బంధం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఆ తర్వాత ప్రభుదేవాని లవ్ లోకి దింపింది. నయనతార కోసం ప్రభుదేవా తన దాంపత్య జీవితానికి గుడ్‌ బై చెప్పి మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చేసాడు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లి వ‌ర‌కు వెళ్లిన వీరి ప్రేమ బ్రేక‌ప్ అయింది. దీంతో కొన్నేళ్లు సింగిల్ గా ఉన్న నయన్ ఆ తర్వాత తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. 'నానమ్ రౌడీ ధాన్ అనే సినిమా తీస్తున్న సమయంలో వారిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు. గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ పెళ్లి చేసుకొంటామని ఊరిస్తున్నారు. అయితే వీళ్లిద్దరు విడిపోయినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా విఘ్నేష్ శివన్ "నా పిల్లలకి తల్లి.."అనే ట్వీట్ తో వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు బలపడ్డాయి. మాతృ దినోత్సవం సందర్భంగా విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో నయన తార ఓ పాపను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. "నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి హ్యాపీ మదర్స్ డే" అంటూ విష్ చేసాడు. దీంతో నయనతారతో తన బంధానికి మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నయనతార ప్రెగ్నెన్సీతో ఉందా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలకి తల్లి కాబోతున్న అని విఘ్నేష్ శివన్ పెట్టిన పోస్ట్ చూస్తే నయన్ పెళ్ళికాకుండా తల్లి కాబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార ప్రెగ్నెన్సీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి విఘ్నేష్ శివన్ ట్వీట్ లో ఆంతర్యం ఏమి దాగుందో అంటున్నారు.

ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలమైన నయన్ ముచ్చటగా మూడోసారి బ్రేక్ అప్ చెప్పకుండా పెళ్లి పీటల దాకా నడవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. త్వరగా పెళ్లి చేసుకొని కామెంట్స్ చేసే వాళ్ళ నోటికి తాళం వేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే లాక్‌ డౌన్‌ కు ముందే నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారని.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా లాక్‌ డౌన్ ముగిసిన వెంటనే పెళ్లికి మరో ముహుర్తాన్ని పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS