• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమమ్ డైరెక్టర్ తో నయన్...

ప్రేమమ్ డైరెక్టర్ తో నయన్ 'గోల్డ్'

By - Tupaki Desk
Update: 2021-09-04 02:30 GMT
లేడీ సూపర్‌ స్టార్ నయనతార కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో కలిపి మొత్తం అర డజను సినిమాల్లో నటిస్తోంది. ఇందులో 'ప్రేమమ్' ఫేమ్ అల్ఫోన్స్‌ పుత్రెన్‌ దర్శకత్వంలో చేస్తున్న మలయాళ మూవీ ''గోల్డ్'' కూడా ఒకటి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారు.

మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. తమిళ నటుడు అజ్మల్ అమీర్ కూడా 'గోల్డ్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల డిస్నీ+హాట్‌ స్టార్‌ ఓటీటీలో విడుదలైన నయనతార 'నెట్రికన్‌' చిత్రంలో అజ్మల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

'గోల్డ్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ లోనే నయనతార ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. గతేడాది అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ - నయనతార లతో 'పాట్టు' అనే చిత్రాన్ని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. ఈ క్రమంలో అల్ఫోన్స్ ఇప్పుడు నయన్ - పృథ్వీరాజ్ లతో ''గోల్డ్'' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు.

ఇకపోతే నయనతార ప్రస్తుతం రజినీకాంత్ సరసన 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తోంది. అలానే విజయ్ సేతుపతి - సమంత లతో కలిసి 'కథువాకుల రెండు కాదల్' సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో నయన్ కీలక పాత్ర పోషించనుంది. షారుఖ్ ఖాన్ - అట్లీ కాంబోలో రూపొందనున్న హిందీ చిత్రంలో కూడా నయనతార ని తీసుకున్నట్లు టాక్. వీటితో పాటు మరో రెండు తమిళ చిత్రాలకు లేడీ సూపర్ స్టార్ కమిట్ అయ్యారు.


Tags:    
  • Nayantara 
  • Gold movie 
  • Premam Director 
  • Alphonse puthren 
  • nayanatara 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS