• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విరాటపర్వం' నుంచి నేచురల్...

విరాటపర్వం' నుంచి నేచురల్ బ్యూటీ పర్ఫెక్ట్ ఫెస్టివల్ లుక్..!

By - Tupaki Desk
Update: 2021-04-13 10:27 GMT
దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'రివ‌ల్యూష‌న్ ఈజ్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనేది ఉపశీర్షిక. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ - 'కోలు కోలు' పాట విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఉగాది కానుకగా సాయి పల్లవికి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు.

సాయి పల్లవి ఇందులో లంగా వోణి ధరించిన పల్లెటూరి అమ్మాయిగా అందంగా కనిపిస్తోంది. ఇంటి గడపకు పసుపు రాస్తూ నవ్వుతూ ఉన్న ఆమె నేచురల్ గా ఉంది. ఫెస్టివల్ మూడ్ కి తగ్గట్టుగా వదిలిన ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో వెన్నెల అనే యువతి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. కాగా, దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'విరాటపర్వం' చిత్రంలో ప్రియ‌మ‌ణి - నివేథా పేతురాజ్ - నందితా దాస్‌ - నవీన్ చంద్ర - ఈశ్వ‌రీరావు - జ‌రీనా వ‌హాబ్ - సాయిచంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తుండగా.. డానీ సాంచెజ్‌ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    
  • Sai Pallavi 
  • Rana 
  • Virataparvam 
  • Tollywood 
  • Movie News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS