'సైకో వర్మ'ను ఒక సినిమాగే చూడండి అంటున్న వర్మ నట్టికుమార్‌

Update: 2020-09-03 17:35 GMT
నట్టి కుమార్‌ నిర్మాణంలో వస్తున్న 'సైకో వర్మ' పై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పాట వర్మను మరీ తిట్టినట్లుగా ఉందంటూ కామెంట్స్‌ వచ్చాయి. మొన్నటి వరకు వర్మ నట్టి కుమార్‌ లు మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. కాని ఉన్నట్లుండి వీరిద్దరి మద్య ఏం జరిగింది అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా వీరిద్దరి మద్య చెడిందా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరరు గతంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు చేసుకున్న వీడియోలను ఇప్పుడు షేర్‌ చేస్తూ గొడవలు వచ్చాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

సైకో వర్మ గురించి జనాల్లో జరుగుతున్న చర్చపై వర్మ మరియు నట్టి కుమార్‌ లు స్పందించారు. మేమిద్దరం గొడవ పడ్డామని ఆ కారణంగానే నేను ఈ సినిమాను తీస్తున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. అది ఏమాత్రం నిజం కాదంటూ నట్టి కుమార్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇక వర్మ కూడా స్పందిస్తూ తాను దాన్ని ఒక సినిమాలాగే చూస్తాను తప్ప వ్యక్తిగతంగా నన్ను తిట్టినట్లుగా నేను భావించడం లేదు అన్నాడు.

మా ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము కేవలం ఒక దర్శక నిర్మాత సంబంధం మాత్రమే కలిగి లేకుండా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ గా కొనసాగుతున్నామని వర్మ అన్నాడు. ముందు ముందు కూడా వర్మతో నేను సినిమాలు తీస్తాను ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను అంటూ నట్టి కుమార్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు లేవని సినిమాను సినిమాలాగే చూడాలంటూ ఇద్దరు కూడా పేర్కొన్నారు. సైకో వర్మ పాటకు మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇద్దరు కూడా వ్యాఖ్యలు చేయడం విశేషం.
Tags:    

Similar News