ట్రెండ్డింగ్‌ లో నేషనల్‌ క్రష్‌ రష్మిక

Update: 2020-11-23 07:50 GMT
సోషల్‌ మీడియాలో హీరోల అభిమానుల స్థాయిలో హీరోయిన్స్‌ అభిమానులు ట్రెండ్డింగ్‌ లు నడపడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాని రష్మిక మందన్నా అభిమానులు మొదటి సారి జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవుతోంది. నేషనల్‌ క్రష్‌ ఆన్‌ ద వరల్డ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం నెట్‌ లో ట్రెండ్‌ అవుతోంది. ఆ హ్యాష్‌ ట్యాగ్‌ తో పాటు నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా కూడా ప్రస్తుతం ట్విట్టర్‌ లో హాట్‌ టాపిక్‌ గా ఉంది. ఈ రెండుతో పాటు నేషనల్‌ క్రష్‌ రష్మిక అంటూ కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

రష్మిక అభిమానులు నెట్టింట చేస్తున్న ఈ సందడి జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవుతోంది. డై హార్ట్‌ ఫ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రష్మిక ను ట్రెండ్డింగ్‌ లో ఉంచారు. కన్నడం మరియు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న ఈ అమ్మడు త్వరలో పుష్పతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతుంది. తమిళంలో కూడా ఈమె హీరోయిన్‌ గా ఎంట్రీ  ఇవ్వబోతుంది. సుల్తాన్‌ సినిమాతో తమిళ సినిమాలో ఈమె నటించింది. వచ్చే ఏడాదిలో రష్మిన మందన్న నాలుగు అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News