• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గని' కోసం గాయాలైనా...

'గని' కోసం గాయాలైనా లెక్కచేయని మెగా ప్రిన్స్!

By - Tupaki Desk
Update: 2022-04-02 15:36 GMT
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ -  సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాతో కథానాయికగా సైయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్న ఈ సినిమాలో జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నరేశ్ .. నదియా ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా జరిగిన ఈవెంట్ కి వేల సంఖ్యలో అభిమానూలు తరలి వచ్చారు.

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన నరేశ్ ఈ వేదికపై మాట్లాడుతూ .. " శుభకృత్ నామ సంవత్సరం ' గని'  సినిమాతో ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కరోనాను దాటుకుని గ్రాండ్ రిలీజ్ వైపు వస్తోంది. ఇలాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వరుణ్ తేజ్ .. చరణ్ .. సాయిధరమ్ తేజ్  .. బన్నీ .. వీళ్లందరూ చిన్నపిల్లల్లా ఉన్నప్పటి నుంచి చూశాను. ఈ రోజున ఇండియా గర్వించదగిన స్టార్స్ అయ్యారు. నేను 'రాకీ' సినిమా చూసినప్పుడు ఇలాంటి ఒక సినిమా ఇండియాలో వస్తుందా అని అనుకున్నాను.

అలాంటి సినిమాగా ఈ నెల 8వ తేదీన 'గని' వస్తోంది. వరుణ్ తేజ్ ఒక దీక్షతో ఈ సినిమా చేశాడు. ఎన్నిసార్లు గాయాలైనప్పటికీ లెక్క చేయలేదు. ఎంతో అంకితభావంతో ఆయన ఈ సినిమాను మీకు అందించబోతున్నాడు.
ఈ సినిమాను అనుకున్న అవుట్ పుట్ తో బయటికి తీసుకుని రావడానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఎంతగా కష్టపడ్డాడనేది నాకు తెలుసు. ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకుని ఆయన ఈ సినిమాను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చాడు. అందులో నిర్మాతల కృషి కూడా ఉంది. అందుకు వాళ్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇది కేవలం తెలుగు సినిమా కాదు .. పాన్ ఇండియా సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంది .. ఎమోషన్ ఉంది .. అన్నిటికీ మించిన హార్డ్ వర్క్ ఉంది. ఈ సినిమాను థియేటర్లలో చూసే సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. కరోనా లేదు .. మాస్క్ లేదు .. 'గని' ఉంది  .. సక్సెస్ కనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. 
Tags:    
  • Ghani 
  • Ghani movie 
  • Ghani special Song 
  • Varun Tej 
  • Saiee Manjrekar 
  • Suniel Shetty 
  • Ghani Pre Release Event 
  • Allu Arjun 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS