• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విడుదలకు నెల ముందే...

విడుదలకు నెల ముందే సెన్సార్

By - Tupaki Desk
Update: 2017-07-27 13:48 GMT
ఇంకో వారం రోజుల్లో సినిమా విడుదల అనగా.. అప్పుడెళ్లి సెన్సార్ తంతు ముగిస్తుంటారు నిర్మాతలు. ఐతే నారా రోహిత్ కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’ విషయంలో మాత్రం నిర్మాతలు మరీ త్వరపడిపోయారు. విడుదలకు నెల రోజులుండగానే సెన్సార్ పని ముగించేశారు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానున్నట్లు మొన్న నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే ‘కథలో రాజకుమారి’ సెన్సార్ అవగొట్టేయడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కట్స్ ఏమీ లేకుండా ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. అంటే ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట.

టైటిల్ లోగో లాంచ్ దగ్గర్నుంచి ‘కథలో రాజకుమారి’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నారా రోహిత్ ఫస్ట్ లుక్.. ఆ తర్వాత వచ్చిన టీజర్.. ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సినిమా మీద పాజిటివ్ ఫీల్ కలిగించాయి.  ఈ చిత్రంతో మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నప్పటికీ మంచి టైమింగ్ కోసం చూసి.. ఆగస్టు 25కు ఫిక్సయ్యారు. రోహిత్ సరసన ‘చుట్టాలబ్బాయి’ ఫేమ్ నమిత ప్రమోద్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య.. నందిత ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మంచి గుర్తింపు సంపాదించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    
  • Nara Rohith 
  • Kathalo Rajakumar Movie 
  • TElugu NEws 

Similar News

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

Copyright @2026

Powered by Blink CMS