• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నారా బాబు వచ్చాడు.....

నారా బాబు వచ్చాడు.. రిలీఫ్ కన్ఫమ్

By - Tupaki Desk
Update: 2016-10-18 17:30 GMT
నారా రోహిత్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘శంకర’కు ఎట్టకేలకు మోక్షం కలిగినట్లే. ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఎప్పుడో నాలుగేళ్ల ముందు మొదలై.. మధ్యలో రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయిన ‘శంకర’.. ఈ మధ్యే వార్తల్లోకి వచ్చింది. గత నెల 16నే రావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. మళ్లీ ఈ నెల 21కి కొత్తగా రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ మధ్యలో ప్రమోషన్ హడావుడి ఏమీ లేకపోవడంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలకు తెరదించుతూ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది ‘శంకర’ బృందం.

‘శంకర’ గురించి పట్టించుకోనట్లుగా ఉన్న నారా రోహిత్ కూడా ఈ సినిమా కోసం కదిలాడు. దర్శక నిర్మాతలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ శుక్రవారం ‘శంకర’ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. మరోవైపు బుక్ మై షోలో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి కాబట్టి.. ఈసారి సినిమా విడుదలవడం పక్కా అని భావించవచ్చు. తమిళ హిట్ మూవీ ‘మౌనగురు’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నారా రోహిత్ సరసన రెజీనా కథానాయికగా నటించింది. భీమలి కబడ్డీ జట్టు.. ఎస్ ఎంఎస్ లాంటి సినిమాలు తీసిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చంద్రమౌళి నిర్మించగా.. సాయికార్తీక్ సంగీతాన్నందించాడు. మరి మొదలైన నాలుగేళ్లకు విడుదల కాబోతున్న ‘శంకర’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohit 
  • Shankara Movie 
  • Telugu new 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS