ఎట్టకేలకు నేచురల్ స్టార్ డిజిటల్ ఎంట్రీ ఖరారు
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటిస్తున్నా.. కథల ఎంపిక విషయంలో ఏమాత్రం రాజీకి రావడం లేదు మన హీరోలు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టక్ జగదీష్ చిత్రీకరణలో ఉండగానే.. శ్యామ్ సింఘరాయ్ చిత్రాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత `అంటే సుందరానికి` అంటూ ఫన్నీ టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ ని ప్రకటించి షాకిచ్చాడు.
ఇదిలా ఉండగానే నెట్ ఫ్లిక్స్ తో ఆర్నెళ్లుగా మంతనాలు సాగిస్తున్న నాని ఎట్టకేలకు తన డిజిటల్ ఎంట్రీని ఖరారు చేసేశాడని తెలుస్తోంది. ఏడాదికి మూడు సినిమాల్లో నటిస్తూనే డిజిటల్ వేదికను విడిచిపెట్టకుండా ఇకపై ప్లాన్ చేస్తున్నాడట. నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి నాని ఇటీవల తన అనుమతి ఇచ్చారు. శ్యామ్ సింఘ రాయ్ .. అంటే సుందరానికి చిత్రీకరణ పూర్తయిన తర్వాత వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. శివ మోక్షం దర్శకత్వంలో టక్ జగదీష్ చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుంది. ఈ నెల నుండే శ్యామ్ సింఘా రాయ్ సెట్స్ లో చేరుతున్నాడు. ఈ చిత్రం 2021 రెండవ భాగంలో విడుదల కావాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఆ తర్వాత `అంటే సుందరానికి` పూర్తి చేసి 2021 క్రిస్మస్ కి విడుదల చేయాలన్న ప్లాన్ ఉంది. అటుపైన వెబ్ సిరీస్ చిత్రీకరణలో బిజీ అయిపోతాడు. నెట్‌ఫ్లిక్స్ త్వరలో మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.