నాని ఏం చెప్పాడండీ..

Update: 2015-07-28 12:21 GMT
ఇండియాలో ఓ వ్యక్తి చనిపోతే.. దేశం మొత్తం కన్నీరు కార్చే సందర్భం బహుశా ఇదే చివరిది కావచ్చేమో. వాజ్ పేయి తో పాటు ఇంకొందరు మహనీయులున్నారు కానీ.. వారి విషయంలో ఎంతో కొంతమందికి వ్యతిరేక భావాలు ఉండే ఉంటాయి. కానీ అబ్దుల్ కలామ్ విషయంలో మాత్రం 120 కోట్ల మందిదీ ఒకే అభిప్రాయం. ఆయన హఠాన్మరణంతో బాధపడని భారతీయుడుండడు. ఇంట్లో వ్యక్తిని కోల్పోయినంతగా అందరూ కన్నీరు కారుస్తున్న విషాదకర సందర్భమిది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కలాం బొమ్మే కనిపిస్తోంది. చిన్నా పెద్దా లేకుండా అందరూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా కలాంజీని స్మరించుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

కలాంజీని ఉద్దేశించి నాని పెట్టిన ట్వీట్ సింపుల్ గా ఆయన గొప్పదనాన్ని తెలిపేదిగా ఉంది. ‘‘మన దేశ రాష్ట్రపతి ఎవరు అనే ప్రశ్నకు నేను ఏమాత్రం తటపటాయించకుండా కాన్ఫిడెంట్ గా సమాధానం ఇచ్చింది.. ఒక్క అబ్దుల్ కలామ్ జీ ప్రెసిడెంటుగా ఉన్నపుడే’’ అని ట్వీట్ చేశాడు నాని. మన హీరోగారి మాట అక్షర సత్యం. ఏమాత్రం జీకే లేని వాళ్లు సైతం కలాం రాష్ట్రపతి ఉన్న ఐదేళ్లూ దేశంలో ఆ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పేసేవారు. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కలాం. కీలుబొమ్మ లాంటి పదవికి కూడా ప్రత్యేకత చేకూర్చారాయన. ఆయననున్నంత కాలం రాష్ట్రపతి కార్యాలయం సామాన్య జనాలతో కళకళలాడేది. నిత్యం ప్రజల సమస్యల్ని ఆలకిస్తూ.. విద్యార్థులతో సంభాషిస్తూ.. దేశానికి మార్గనిర్దేశం చేస్తూ ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందారాయన. అందుకే ఇప్పటికీ చాలామంది దృష్టిలో కలాంజీనే రాష్ట్రపతి.
Tags:    

Similar News