• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్: అక్షరం పట్టిన...

టీజర్: అక్షరం పట్టిన ఆయుధం పేరే 'శ్యామ్ సింగ రాయ్'

By - Tupaki Desk
Update: 2021-11-18 12:58 GMT
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ ని విడుదల చేసి సినిమా ప్రమోషన్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విడుదల చేయబడిన పోస్టర్స్ - గ్లిమ్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు.

'శ్యామ్ సింగ రాయ్' తెలుగు టీజర్ ను హీరో నాని.. మలయాళ టీజర్ ను హీరోయిన్ నజ్రిమా.. కన్నడలో రక్షిత్ శెట్టి.. తమిళ్ టీజర్ ను శివ కార్తికేయన్ ఆవిష్కరించారు. ''అడిగే అండ లేదు..కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకు పుట్టి, రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసని.. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే..'' అంటూ వచ్చిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

1970స్ నాటి కలకత్తా నేపథ్యాన్ని ప్రస్తుత కాలానికి లింక్ చేస్తూ 'శ్యామ్ సింగ రాయ్' ని తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతోంది. నాని ఇంతకు ముందెన్నడూ చూడని రెండు విభిన్నమైన క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. అందులో శ్యామ్  పాత్ర కలకత్తాలో విప్లవ భావాలు కలిగిన ఓ రచయిత అని.. ఆచారాల పేరుతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడమే కాకుండా తన ప్రజల తరపున నిలబడి శత్రువులతో పోరాడిన వ్యక్తి అని టీజర్ ని బట్టి తెలుస్తుంది. అలానే వాసు మోడరన్ యువకుడిగా కనిపిస్తున్నాడు.

రెండు పాత్రలు కూడా ప్రజల కోసం ఫైట్ చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు. శ్యామ్ సింగరాయ్ కు జోడిగా సాయి పల్లవి కనిపిస్తుంటే.. వాసు ప్రేయసిగా కృతి శెట్టి లిప్ లాక్ చేస్తూ కనిపించింది. మరి నాని రెండు పాత్రలకు మధ్య సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 'స్త్రీ ఎవరికి దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్' అంటూ బెంగాలీలో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. బెంగాలీ యువకుడి వస్త్రధారణలో నాని గెటప్ చాలా కొత్తగా ఉంది.

'శ్యామ్ సింగ రాయ్' టీజర్ కు మిక్కీ జె మేయర్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్.. సాను జాన్ వర్గేష్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ ప్రేక్షకులను అలరించడంతో పాటుగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సత్యదేవ్ జంగా ఈ చిత్రానికి కథ అందించారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో జిషు సేన్‌ గుప్తా - రాహుల్‌ రవీంద్రన్‌ - మురళీ శర్మ - అభినవ్‌ గోమటం - లీలా శాంసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.






Full View


Tags:    
  • ShyamSinghaRoyTeaser 
  • Shyam Singha Roy Telugu Teaser 
  • Nani 
  • ShyamSinghaRoy 
  • Sai Pallavi 
  • Krithi Shetty 
  • Rahul Sankrithyan 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS