• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని చేసేది ఆ కథ కాదట

నాని చేసేది ఆ కథ కాదట

By - Tupaki Desk
Update: 2016-11-03 04:27 GMT
‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా మొదలవడం.. అనివార్య కారణాలతో అది ఆగిపోవడం.. ఆ తర్వాత ఇదే కథను అక్కినేని నాగార్జునకు చెప్పడం.. ఆయన అంతగా ఆసక్తి చూపించకపోవడం తెలిసిందే. ఇప్పుడు ఇదే కథను నానికి వినిపించారని.. అతను ఓకే అన్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఐతే దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఆ కథ కాదట. నాని కోసం వేణు శ్రీరామ్ వేరే కొత్త కథ తయారు చేశాడట.

రవితేజ కోసం తయారు చేసింది పక్కా మాస్ యాక్షన్ కథ అని.. నానికి ఆ కథ ఎంత మాత్రం సూటవ్వదని.. ప్రస్తుతానికి ఆ కథను పక్కనబెట్టి నాని కోసం వేరే ఫ్యామిలీ స్టోరీని వేణు రెడీ చేశారని తెలిసింది. అయినా రవితేజ ఇమేజ్ వేరు. నాని ఇమేజ్ వేరు. మాస్ రాజాకు అనుకున్న కథను నాగార్జునతో చేయొచ్చేమో కానీ.. నానితో చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ కథ కొత్తదే కావచ్చని భావించవచ్చు. ఐతే ‘నేను లోకల్’ తర్వాత కొత్త దర్శకుడు శివశంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టేయడానికి నాని సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో వేణు సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఆలస్యం కావచ్చు. వచ్చే ఏడాది ద్వితీయార్దంలో ఈ చిత్రం ఆరంభమయ్యే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nani 
  • Venu Sriram 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS