• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జై బాలయ్య అంటూ రిలీజ్...

జై బాలయ్య అంటూ రిలీజ్ డేట్

By - Tupaki Desk
Update: 2015-12-28 17:30 GMT
నందమూరి నటసింహం అభిమానిగా నేచురల్ స్టార్ నాని ఓ మూవీ చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి బోలెడు అప్ డేట్స్ బయటకు రానున్నాయి. 2016 న్యూ ఇయర్ రోజున ఫస్ట్ లుక్ నుంచి అనేక సంగతులు వెల్లడించనున్నాడు నాని.

కొత్త ఏడాదిని వేడుకలా స్టార్ట్ చేయడానికి కారణం ఉంది. ఈ ఏడాది 2015 నాని కెరీర్ లో ది బెస్ట్ అనాల్సిందే. ఏళ్ల తరబడి ఎదురుచూసిన బ్రేక్.. నానికి ఈ సంవత్సరమే వచ్చింది. చాలాకాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్న నాని.. భలేభలే మగాడివోయ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. లో బడ్జెట్ మూవీగా వచ్చి, మీడియం బడ్జెట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి, తన స్థాయిని ఒకేసారి 4-5 రెట్లు పెంచుకోగలిగాడు. అందుకే 2015కి ఘనంగా వీడ్కోలు పలికి, 2016లోనూ అదే రేంజ్ కంటిన్యూ చేయడానికి నేచురల్ స్టార్ సిద్ధమవుతున్నాడు.

అందాల రాక్షసి తీసి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో.. బాలకృష్ణ అభిమానిగా, ఓ క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు నాని. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని జనవరి 1న విడుదల చేసి, ఆడియో వేడుకను జనవరి 10న నిర్వహించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను.. సంక్రాంతికి రిలీజ్ కానున్న భారీ చిత్రాలతో పాటు థియేటర్లలో ప్రదర్శించి.. మరింత హైప్ తెచ్చేందుకు ప్లాన్ చేశారు. కాగా.. తన లేటెస్ట్ మూవీ ఫిబ్రవరి 5న థియేటర్లలోకి తీసుకురావాలని నాని నిర్ణయించుకున్నాడు.
Tags:    
  • Nani 
  • Hero Nani 
  • Tollywood movies 
  • Telugu NEWs 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS