ఆత్రేయ డైరెక్ట‌ర్ రెండో సినిమా ఎవ‌రితో?

Update: 2019-07-07 16:29 GMT
ఏజెంట్ ఆత్రేయా ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. డిటెక్టివ్ క‌థతో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కులు స‌హా ఓవ‌ర్సీస్ ఆడియెన్ ని మెప్పించింది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్వ‌రూప్ గురించి ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స్వ‌రూప్ తెర‌కెక్కించే రెండో సినిమా ఏది? అన్న చ‌ర్చా ఫిలింన‌గ‌ర్ లో వేడెక్కిస్తోంది. ఇప్ప‌టికే నాని కోసం క‌థ రెడీ చేశాడ‌ని అత‌డితోనే రెండో సినిమా చేసే ఆలోచ‌న ఉంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఒక‌టో సినిమాతో మెప్పిస్తే రెండో సినిమాకి అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ప్ర‌స్తుత స‌న్నివేశంలో నాని దొరుకుతాడా?  లేదా అన్న‌దే ఆస‌క్తిక‌రం. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస్ ఆత్రేయ చిత్రంతో చ‌క్క‌ని విజ‌యం అందుకుని ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకున్న స్వ‌రూప్ అన్నీ కుదిరితే నానీకి క‌థ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు కోన వెంక‌ట్ లాంటి స్టార్ రైట‌ర్ కం నిర్మాత బ‌రిలో దిగ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కోన ఇప్ప‌టికే స్వ‌రూప్ కి అడ్వాన్స్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఏజెంట్ ఆత్రేయ రిలీజ్ కి ముందే స్వ‌రూప్ కాల్షీట్ల‌ను అత‌డు లాక్ చేశాడ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ త‌న రెండో సినిమా ఎవ‌రితో అన్న‌ది ఎక్క‌డా చెప్ప‌లేదు కానీ.. అత‌డు తెర‌కెక్కించే రెండో సినిమా నాని- కోన కాంబినేషన్‌ లోనే ఉంటుంద‌న్న టాక్ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ నానీతో క‌మిటైన‌ట్టు కానీ లేదా ఫ‌లానా హీరో న‌టిస్తార‌ని కానీ స్వ‌రూప్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే నానీతోనే అత‌డు సినిమా తెర‌కెక్కించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌న్న మాట వినిపిస్తోంది. ఇక నాని - కోన అనుబంధం గురించి తెలిసిందే. నిన్ను కోరి సినిమా కోసం ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేశారు. ఆ క్ర‌మంలోనే నానీని ఒప్పించ‌డం కోన‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె జాక్ పాట్ కొట్టిన‌ట్టే.


Tags:    

Similar News