ఫోటో స్టొరీ: ఏడుకొండలవాడిగా ఎన్ బీ కే
'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా విడుదలకు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ బయోపిక్ మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్య దాదాపుగా 63 విభిన్న గెటప్పులలో కనిపిస్తాడని తెలిసిందే. సినీ చరిత్రలో ఏ ఇతర హీరోకు లేని రికార్డ్ ఇది.
ఎన్టీఆర్ తన సుదీర్ఘ నట ప్రయాణంలో వందల కొద్దీ విభిన్న పాత్రలు పోషించారు. వాటిలో రాముడు.. కృష్ణుడు.. దుర్యోధనుడు..కర్ణుడు లాంటి పౌరాణిక పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పటికీ ఎవరైనా నటులు అలాంటి పాత్రలు పోషించాలంటే ఎన్టీఆర్ ను రిఫరెన్స్ గా తీసుకుంటారు. కానీ ఇలాంటి పౌరాణిక పాత్రల్లో పెద్దగా పాపులర్ కాని పాత్ర శ్రీవెంకటేశ్వరస్వామిది. 1960 లో విడుదలైన 'శ్రీవెంకటేశ్వరస్వామి' మహత్యం సినిమాలో నటించారు. ఆ సినిమాలోనే ఎన్టీఆర్ ఏడుకొండల స్వామిగా నటించారు. 'ఎన్టీఆర్ కథానాయకుడు' టీమ్ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో బాలయ్య తిరుమల వేంకటేశుని పాత్రలో ఉన్నారు. వెనక వెంకటేశ్వర స్వామి విగ్రహం.. ముందేమో స్వామివారి గెటప్ లో నడుచుకుంటూ వస్తున్న బాలయ్య. ఎలా ఉందనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్.
బాలయ్య మేకప్ అద్భుతంగా ఉంది. మేకప్ వేసిన వారు అతి చిన్న డీటెయిల్స్ ను కూడా మిస్ కాకుండా చూసుకున్నారు.. ఆ మేకప్.. పాత్రకు తగ్గ హావ భావాలతో బాలయ్య వెంకటేశ్వర స్వామిని తలపించాడు. బాలయ్య వేసిన ప్రతి గెటప్ కు దర్శకుడు క్రిష్ చూపించిన శ్రద్ధ కూడా మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మరో రెండు రోజుల్లో బాలయ్య విశ్వరూపం చూసేందుకు రెడీగా ఉండండి.
Full View