• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘నక్షత్రం’ సంగతి...

‘నక్షత్రం’ సంగతి ఎట్టకేలకు తేల్చేశారబ్బా

By - Tupaki Desk
Update: 2017-07-16 04:15 GMT
కృష్ణవంశీ అభిమానుల నిరీక్షణ ఫలించబోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ విలక్షణ దర్శకుడి కొత్త సినిమా ‘నక్షత్రం’ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొన్ని రోజులుగా ‘నక్షత్రం’ రిలీజ్ డేట్ విషయంలో నడుస్తున్న సస్పెన్సుకు ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 28న ‘నక్షత్రం’ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ముందు 21నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. ఐతే ‘నక్షత్రం’లో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో.. 21న మరో మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘ఫిదా’కు పోటీ వెళ్లడం బాగోదని ఆ ఆలోచన మానుకున్నట్లున్నారు. 28న ‘గౌతమ్ నందా’.. ‘వీఐపీ-2’ ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్నా సరే.. ‘నక్షత్రం’ను కూడా అదే రోజున రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యారు.

వరుస డిజాస్టర్ల నుంచి బయటపడి.. ‘గోవిందుడు అందరివాడే’తో కాస్త నిలదొక్కుకున్న కృష్ణవంశీ.. ఎంతో కాన్ఫిడెంట్ గా ‘నక్షత్రం’ మొదలుపెట్టాడు. చకచకా షూటింగ్ చేశాడు. కానీ ఓ దశ దాటాక ఈ సినిమాకు బ్రేక్ పడింది. షూటింగ్ ఆగింది. చివరికి ఎలాగోలా సినిమాను పూర్తి చేసినా.. విడుదలకు మాత్రం నోచుకోలేదు. కొన్ని నెలల పాటు సినిమా వార్తల్లోనే లేదసలు.

చివరికి ఉన్నట్లుండి మేలో రిలీజ్ అంటూ ప్రకటన చేశారు. ఆ నెల దాటిపోయింది. తర్వాత జూన్ అన్నారు. అదీ పోయింది. చివరికి ఈ నెల ఆరంభంలో ఆడియో వేడుక చేశారు. సినిమాను ఎట్టకేలకు నెలాఖర్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్.. రెజీనా.. సాయిదరమ్.. ప్రగ్యా జైశ్వాల్.. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. కృష్ణవంశీ కెరీర్ కు అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ చిత్రం ఆయనకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.
Tags:    
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 
  • Nakshatram Release Date 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS