• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవదాస్ కోసం ఎడిటర్ నాగ్?

దేవదాస్ కోసం ఎడిటర్ నాగ్?

By - Tupaki Desk
Update: 2018-09-10 17:20 GMT
దేవదాస్ 27న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకో పదిహేను రోజులు మాత్రమే టైం ఉండటంతో బాలన్స్ ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. తనదైనా చైతు అఖిల్ ల దైనా అన్ని దగ్గరుండి చూసుకునే నాగ్ దేవదాస్ విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. దర్శకడు శ్రీరామ్ ఆదిత్యకు కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అందులోనూ పెద్ద స్టార్ హీరోలను డీల్ చేయలేదు. అందుకే ఎక్కడైనా తడబడ్డాడేమో అని నాగ్ దగ్గరుండి మరీ అన్ని చూసుకునే పరిస్థితి కనిపిస్తోందని వినికిడి. అదే నిజమైతే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరమే కానీ ప్రమేయం ఎక్కువైతే సమస్యలు రావొచ్చు. నిజానికి శైలజారెడ్డి అల్లుడు వ్యవహారంలో కూడా నాగ్ పర్యవేక్షణ బాగానే సాగిందట. చైతుకు ఇలాంటి జానర్ మొదటిసారి కావడంతో నాగ్ టీమ్ దగ్గరుండి చక్కదిద్దినట్టు తెలిసింది. అందుకే దేవదాస్ ను సైతం ఇలాగే కాస్త ఎడిటింగ్ ప్లస్ రిపేర్లు చేసే అవకాశం ఉందంటున్నారు.

నిజానికి నాగ్ జడ్జ్ మెంట్ లు ఈ మధ్య అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు. తనే స్వంతంగా నిర్మించి అఖిల్ కు రీ లాంచింగ్ రేంజ్ లో పదే పదే చెప్పుకున్న హలో రిజల్ట్ ఏమైందో తెలిసిందేగా. అందుకే దేవదాస్ విషయంలో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. పైగా నిర్మాత అశ్వినిదత్ కు నాగ్ మంచి ఆప్తుడు. కింగ్ ఏది చెప్పినా దత్ కాదనరు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆఖరి పోరాటం-గోవిందా గోవిందా-రావోయి చందమామ-ఆజాద్ లాంటి సినిమాలు వచ్చాయి. చిరంజీవి తర్వాత అశ్వినిదత్ ఎక్కువ సినిమాలు తీసింది నాగార్జునతోనే. అందుకే నాగ్ సైతం దేవదాస్ ని తన స్వంత సినిమాలాగా భావించడంలో ఆశ్చర్యం లేదు. నాని డాక్టర్ గా నాగ్ డాన్ గా నటిస్తున్న ఈ మూవీకి రష్మిక మందన్న మరో ప్రధాన ఆకర్షణగా మారింది. మణిశర్మ చాలా కాలం తర్వాత స్టార్ హీరో సినిమాకు పూర్తి స్థాయి సంగీతం అందిస్తున్నారు. ఏఎన్ ఆర్ గారి ఎవర్ గ్రీన్ టైటిల్ తో వస్తున్న మూవీ కాబట్టి దాని పేరు చెడగొట్టకుండా నాగ్ ఈ మాత్రం కేర్ తీసుకోవడం మంచిదే.
Tags:    
  • Nagarjuna 
  • Devadas Movie 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS