• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవ‌దాస్ విష‌యంలో నాగ్...

దేవ‌దాస్ విష‌యంలో నాగ్ అలా చేశాడేంటి?

By - Tupaki Desk
Update: 2018-07-08 08:33 GMT
టాలీవుడ్ ట్రెండ్ సెట్ట‌ర్ `శివ `త‌ర్వాత ఆ స్థాయి సినిమా అంటూ నాగ్ తో వ‌ర్మ `ఆఫీస‌ర్ ` ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ సినిమాలో వ‌ర్మ చెప్పినంత విష‌యం లేక‌పోవ‌డంతో అది డిజాస్ట‌ర్ అయింది. త‌న జ‌డ్జిమెంట్ విష‌యంలో నాగ్ కూడా పొర‌పాటు ప‌డ్డాడ‌ని టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే నాగ్ తన త‌ర్వాతి సినిమా విష‌యంలో కొద్దిగా జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. నాని, నాగ్ ల కాంబోలో తెరకెక్కుతోన్న `దేవదాస్` గురించి నాగ్ రివీల్ చేసిన విష‌యాలే అందుకు నిద‌ర్శ‌నం. మామూలుగా అయితే, సినిమా రిలీజ్ వ‌ర‌కు జ‌స్ట్ స్టోరీ లైన్ మాత్ర‌మే రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ ఇష్ట‌ప‌డుతుంది. కానీ, `దేవ‌దాస్ `లో త‌మ క్యారెక్ట‌ర్లు ఎలా ఉండ‌బోతున్నాయి..అనే విష‌యంతోపాటు...దాదాపుగా పూర్తి క‌థ‌ను నాగ్ రివీల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నాగ్ - నాని ల కాంబోలో రాబోతోన్న‌ది ఓ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని నాగ్ చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో నాగ్...ఓ మాఫియా డాన్ అని...కానీ, పర్స‌న‌ల్ లైఫ్ లో చాలా రొమాంటిక్ తెలుస్తోంది. ఆ డాన్ ఫ్రెండ్ అయిన నాని ఓ డాక్ట‌ర్ అని....త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో ఆ డాన్ గ్యాంగ్ కు స‌పోర్ట్ చేసే రోల్ ను నాని పోషిస్తున్నాడ‌ని రివీల్ అయింది. దీంతో, ఈ చిత్ర టీజ‌ర్ - ట్రైల‌ర్ విడుద‌ల కాకుండానే....దాదాపుగా స్టోరీ అంతా రివీల్ అయింద‌ని టాక్ వ‌స్తోంది. అయితే, నాగ్ ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే స్టోరీ రివీల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. నాని - నాగ్ ల మ‌ల్టీ స్టార‌ర్ అన‌గానే ప్రేక్ష‌కులు భారీ అంచనాల‌తో థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని....అందుకే ఆ అంచనాల‌ను బ్యాలెన్స్  చేసేందుకు నాగ్ స్టోరీ రివీల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి, నాగ్ కొత్త స్ట్రాట‌జీ వ‌ర్క‌వుట‌వుతుందో లేదో తెలియాలంటే కొంత‌కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు!
Tags:    
  • Nani 
  • Nagarjuna 
  • Devadas Movie 
  • Telugu NEws 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS