• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ అభిమానులకు ట్రీట్...

నాగ్ అభిమానులకు ట్రీట్ రెడీ

By - Tupaki Desk
Update: 2017-08-26 07:50 GMT
కొంచెం గ్యాప్ తర్వాత అక్కినేని నాగార్జున లైన్లోకి వచ్చాడు. ఆయన కొత్త సినిమా ‘రాజు గారి గది-2’కు సంబంధించి ప్రచార హడావుడి మొదలైపోయింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ తప్పితే ఇంకేమీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ‘రాజు గారి గది-2’ లోగోను పరిచయం చేశారు. దీంతో పాటు త్వరలోనే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఇంకో మూడు రోజుల్లో.. అంటే ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజు. ఆ రోజే ‘రాజు గారి గది-2’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. ఇంకో నెలన్నర లోనే ‘రాజు గారి గది-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇక ప్రమోషన్ మొదలుపెట్టి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చిత్ర బృందం భావిస్తోంది.

‘రాజు గారి గది-2’ షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయినప్పటికీ.. కొన్ని మార్పులు చేర్పులతో రీషూట్లు అవీ చేయడానికి కొంచెం సమయం పట్టింది. దీపావళి కానుకగా అక్టోబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘రాజు గారి గది’లో నటించిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. నాగార్జున కాబోయే కోడలు సమంతతో పాటు సీరత్ కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. పీవీపీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాగార్జున ఇందులో మోడర్న్ మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన గెటప్ అదీ కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో నాగ్ ఎలా కనిపిస్తాడో చూడాలి.

Full View
Tags:    
  • Nagarjuna 
  • Raju Gari Gadhi 2 Movie 
  • Telugu NEWs 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS