ఎన్టీఆర్ కోసం నన్నెవరూ అడగలేదు: నాగ్

Update: 2018-09-24 04:35 GMT
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్' లో మరో తెలుగు లెజెండ్ ఏఎన్నార్ పాత్రలో నాగార్జున మేనల్లుడు సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.  రీసెంట్ గా తాతగారు ఎఎన్నార్ గెటప్ లో ఉన్న సుమంత్ ఫస్ట్ లుక్ 'ఎన్టీఆర్' టీమ్ రిలీజ్ చేస్తే సుమంత్ లుక్ పై ప్రశంసల వర్షం కురిసింది. అచ్చుగుద్దినట్టు తాతగారిలా ఉన్నాడని అందరూ అన్నారు.

కానీ నాగార్జున మాత్రం ఆ ఫస్ట్ లుక్ పై స్పందించలేదని కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయలేదని కొంతమంది అన్నారు.  అసలే నాగార్జునకు.. మేనల్లుడు సుమంత్ కు విభేదాలు ఉన్నాయని రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా నాగార్జున.. బాలకృష్ణలు చాలా ఏళ్ళ నుండి అంటీముట్టనట్టుగా ఉంటున్నారన్న సంగతి కూడా తెలిసిందే.  ఇవన్నీ పక్కన బెడితే నాగార్జున రీసెంట్ గా సుమంత్ ఎఎన్నార్ లుక్ పై స్పందించాడు.

ఎన్టీఆర్ లో పాత్ర కోసం తననెవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. తనకు నాన్నగారి పోలికలు ఎక్కువగా లేవని.. పైగా నాన్నగారి కంటే తను చాలా పొడవని అన్నాడు. అయన ఐదడుగులా ఆరంగుళాలు ఉంటే తను ఆరడుగుల పొడవని చెప్పాడు. హైటు విషయం పక్కనబెడితే సుమంత్ దాదాపు నాన్నగారిలాగానే ఉంటాడని చెప్పాడు.  ఇక నాన్నగారి  పాత్రలో సుమంత్ లుక్ తనకు నచ్చిందని.. సంతోషంగా ఉందని తెలిపాడు.  ఇక ఏఎన్నార్ లుక్ కాకుండా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా లుక్ కూడా తనకు నచ్చిందని చెప్పాడు.
Tags:    

Similar News