• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హలో బ్రదర్'లో నాగ్ కి...

'హలో బ్రదర్'లో నాగ్ కి డూప్ గా చేసింది ఈ స్టార్ హీరోనే!

By - Tupaki Desk
Update: 2022-04-19 00:30 GMT
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'హలో బ్రదర్' ఒకటిగా కనిపిస్తుంది. నాగార్జున ఫస్టు టైమ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. అలాగే నాగార్జునను మాస్ ఆడియన్స్ కి మరింత చేరువ చేసిన సినిమా ఇది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు. 1994లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. ఈవీవీ కథాకథనాలు .. పాత్రలను మలచిన తీరు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.

లవ్  .. యాక్షన్ .. ఎమోషన్ ..  సెంటిమెంట్ .. రొమాన్స్ .. కామెడీ .. ఇలా అన్ని అంశాలను ఈవీవీ సమపాళ్లలో రంగరించి అందించిన కథ ఇది. ముఖ్యంగా నాగార్జున పోషించిన రెండు పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు అద్భుతం. రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని ఆయన ఒక రేంజ్ లో ఆవిష్కరించారు. ఈ కథలో అన్ని రసాలను తగినట్టుగా సర్దుతూ వెళ్లడం వలన, చివరివరకూ కథనంలో పట్టు తగ్గకుండా నడిపించడం వలన ఎక్కడా బోర్  కొట్టదు. ఇప్పటికీ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడానికి కారణం ఈవీవీ గొప్పతనమే.

ఇక నాగ్ సరసన రమ్యకృష్ణ .. మరో నాగ్ జోడీగా సౌందర్య  సందడి చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ సినిమాలో నాగార్జునలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించవలసి వచ్చినప్పుడు, నాగార్జునకి మరో హీరో డూప్ గా చేశాడు.  నాగార్జున చెప్పేవరకూ ఈ విషయం బయటి ప్రేక్షకులలో ఎవరికీ తెలియదు. ఇంతకీ నాగార్జునకి డూప్ గా  చేసిన ఆ హీరో ఎవరో కాదు .. శ్రీకాంత్. ఆయనకి ఈవీవీతో మంచి సాన్నిహిత్యం ఉంది. నాగార్జున హైటుకి .. పర్సనాలిటీకి దగ్గరగా శ్రీకాంత్ ఉండటంతో ఆయనకి ఈవీవీ ఈ ఛాన్స్ ఇచ్చారట.

ఆ మధ్య  ఒక సందర్భంలో నాగ్ ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత కూడా నాగార్జున 'సోగ్గాడే  చిన్నినాయనా' వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసినప్పటికీ, ' హలో బ్రదర్' స్థాయిలో ఏదీ అలరించలేకపోయింది .. ఆకట్టుకోలేకపోయింది. నాగ్ డ్యూయెల్  రోల్ మూవీ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఈ సినిమానే. అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఆ తరువాత కూడా శ్రీకాంత్ అటు నాగార్జున .. ఇటు ఈవీవీ సినిమాలలోను నటించాడు. ఇక ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోవడానికి మరో కారణం రాజ్ - కోటి అందించిన బాణీలని చెప్పుకోవచ్చు.  
Tags:    
  • Nagarjuna 
  • Hello Brother 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS