నాగార్జున... ఒక్క రోజు!

Update: 2016-02-07 09:30 GMT
త‌న‌యుడు నాగ‌చైత‌న్య న‌టిస్తున్న సినిమాలో నాగార్జున అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆ పాత్ర కోసమ‌ని నాగ్  ఒక రోజు కాల్షీటుని కేటాయించార‌ట‌. నాగ‌చైత‌న్య - నాగార్జున కలిసి న‌టించ‌డం ఇది కొత్తేం కాదు. మ‌నంలో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఇటీవ‌ల అఖిల్ తొలి సినిమాలోనూ నాగ్ క‌నిపించాడు. త‌న‌యుల సినిమాలో తండ్రి నాగ్ క‌నిపిస్తే అభిమానుల‌కి ఓ కిక్కులా ఉంటుంద‌ని భావిస్తూ ద‌ర్శ‌కులు అలా ప్లాన్ చేస్తుంటార‌న్న‌మాట‌. అయితే నాగ‌చైత‌న్య సినిమాలో మాత్రం నాగార్జున ఏదో స‌ర‌దాగా అనో,  స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కోస‌మ‌నో న‌టించ‌డం లేద‌ట‌. ఆ పాత్ర సినిమాకి చాలా కీల‌క‌మ‌ట‌. అందుకే నాగ్ న‌టించేందుకు ఒప్పుకొన్న‌ట్టు తెలిసింది.
 
మ‌ల‌యాళంలో విజ‌యంత‌మైన ప్రేమ‌మ్‌ కి రీమేక్‌ గా నాగచైతన్య చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. మ‌జ్ను పేరుతో  రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు  చేరుకున్న‌ట్టు స‌మాచారం. ఇందులో  చైతూ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్‌ తో పాటు, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - మ‌డోనా సెబాస్టియ‌న్ న‌టిస్తున్నారు. కార్తికేయ ఫేమ్  చందు మొండేటి ద‌ర్శ‌కుడు. వేస‌విలోనే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. నాగ‌చైత‌న్య - నాగార్జున ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. నాగ‌చైత‌న్య కెరీర్‌ కి ఈ సినిమా ఫ‌లితం చాలా కీల‌కం. మ‌రి ఎలాంటి ఫ‌లితం సొంతం చేసుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News