నిహారిక ఎలాంటి తప్పు చేయలేదు.. పోలీసులు చెప్పారు!- నాగబాబు
బంజారాహిల్స్- రాడిసన్ లోని ఓ పబ్‌లో రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫేం రాహుల్ సిప్లిగంజ్ సహా ఎంపీల వారసులు చివరికి పోలీస్ ఉన్నతాధికారుల పిల్లలు ఈ పార్టీలో ఉన్నట్టు కథనాలొచ్చాయి. దాదాపు 150 మందిని పోలీసులు అరెస్టు చేసి చివరిగా పది మంది ప్రముఖులను సుదీర్ఘ కాలం విచారించారని మీడియా వెల్లడించింది.
నేటి తెల్లవారుజాము వరకూ నిహారిక విచారణ సాగింది. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి తన కారులో ఎక్కిన వీడియోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే యూట్యూబ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమెకు నోటీసులు అందాయని తదుపరి తేదీలో విచారణకు పిలవవచ్చని కథనాలొచ్చాయి.
అయితే జరిగిన ఘటనలో వాస్తవం ఎంత? నిహారిక తప్పిదం ఎంత? అన్నదానికి సమాధానమిస్తూ.. నాగబాబు తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ``అనుమతించిన సమయం తర్వాత కూడా పబ్ నడుపుతున్నందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారిక విషయానికి వస్తే.. ఆమె స్పష్టంగా ఉంది.
ఆమె ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు మాకు తెలియజేసారు`` అని నాగబాబు తెలిపారు. ``ఆ సమయంలో అక్కడ ఉన్నందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఊహాగానాలకు ఆస్కారం ఉండకూడదనే ఈ క్లారిటీ ఇస్తున్నాను. మన మనస్సాక్షి చాలా స్పష్టంగా ఉంది. అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కోరుతున్నాను`` అని నాగబాబు కోరారు.
నాగబాబు తన కుమార్తె విషయంలో ఇచ్చిన స్పష్ఠతతో మీడియాలో దీనిపై అనవసర ఊహాగానాలు ఆగిపోతాయనే ఆశిద్దాం. మెగా బ్రదర్ ఇటీవల తన సినిమా కమిట్ మెంట్లను తగ్గించుకుని పూర్తి సమయం రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కీలక సమయంలో ఇలా జరగడం అభిమానులను జనసేన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే నిహారిక పై పోలీస్ విచారణలో ఏం తేలనుందో వేచి చూడాలి. నిహారిక సహా ఇతరులపైనా ఈ కేసు విషయమై విచారణ సాగుతోంది.
Full View