గుస‌గుస‌: చెవిటి మూగ యువ‌కుడిగా శౌర్య

Update: 2020-12-19 09:30 GMT
నిశ్శ‌బ్ధం చిత్రంలో స్వీటీ అనుష్క శెట్టి చెవిటి మూగ యువతిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. కె.విశ్వ‌నాథ్ లా ప్ర‌యోగం చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కోన వెంక‌ట్ అండ్ కో ప్ర‌య‌త్నం అంత‌గా మెప్పించ‌లేదు. అయితే ఆ త‌ర్వాత ఈ త‌ర‌హా ప్ర‌యోగాల గురించి వ‌రుస క‌థ‌నాలు హీట్ పెంచేస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్ యువ‌హీరో నాగ‌శౌర్య చెవిటి మూగ (బ‌దిర) యువ‌కుడిగా ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతున్నార‌న్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో ఈ త‌ర‌హా పాత్ర పోషించ‌నున్నార‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం.

అయితే ఇది నిజ‌మా? అంటే .. హీరో నాగ శౌర్య ప్రస్తుతం మూడు ప్రాజెక్టుల షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు. అతను తన హోమ్ బ్యానర్ లో  ఒక రొమాంటిక్ కామెడీ ... అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మ‌రో రొమాంటిక్ డ్రామా చేస్తున్నాడు. ఇవేగాక శౌర్య మరో మూడు ప్రాజెక్టులపై సంతకం చేసారు. త్వరలోనే వీటికి సంబంధించిన‌ అధికారిక ప్రకటనలు విడుదల కానున్నాయి.

నంద‌మూరి బాలకృష్ణ మూవీలోనూ శౌర్య న‌టిస్తున్నార‌ని ఇటీవ‌ల‌ వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి డెబ్యూ శ్రీమాన్ వేముల  ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నార‌ని.. ఇందులో శౌర్య చెవిటి మూగ వ్యక్తి పాత్రలో నటించనున్నారని ప్ర‌చార‌మ‌వుతోంది. శౌర్య పాత్ర చాలా ఆహ్లాదకరంగా వినోదాత్మకంగా ఉంటుందట‌. ఈ చిత్రంలో బాలయ్య- శౌర్య ఇద్దరికీ సముచిత‌ ప్రాముఖ్యత ఉంటుంద‌ని.. వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ‌తార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News