జాదూగాడు స్పెషల్ : మాస్ కిరీటానికి అర్హుడే

Update: 2015-06-27 07:30 GMT
తెలుగు సినిమాల్లో హీరో పాత్రలు రెండు రకాలు. ఒకటి కథలో ఒకడిగా తన పాత్రను పోషించడం. రెండోది కథను తన భుజలపైకే ఎత్తుకోవడం. రెండో కేటగిరీ వారిని మాస్ రాజాలుగా చెప్పుకుంటారు. సీనియర్ హీరోలలో అందరికీ మాస్ తోపాటు అన్ని వర్గాల్లోనూ మంచి గుర్తింపే వుంది. ఇప్పుడిప్పుడే యువ హీరోలుగా రాణిస్తున్న వారూ ఈ కేటగిరీలో చేరడానికి వారి శక్తులన్నీ ఒడ్డుతున్నారు. కానీ దానికి ఎంట్రీ కార్డ్ నాగశౌర్యకు మాతమే వచ్చింది.

పాత్రలో డ్రామాని ఎంతవరకూ పండించాలనేది దర్శకుడి పనైతే దాన్ని ఎలా రక్తి కట్టించాలనేది నటుడి పని. మాస్ గుర్తింపు కావాలనుకున్న వారికి ఈ కొలమానం ఖచ్చితంగా తెలియాలి. లేదంటే సందీప్ కిషన్ లా మిగిలిపోతారు. శౌర్యకు ఆ కొలతలన్నీ ఒంటబట్టినట్టే వున్నాయి. ప్రతి సీన్ లోనూ తన పరిధి దాటకుండా ప్రేక్షకులను సీట్లో బాగానే కూర్చోబెట్టాడు. ఇక డాన్సులు కూడా ఇంతవరకూ శౌర్య ఈ లెవెల్ లో చేయలేదు. ఫైట్స్ అంటే సరేసరి. జాదూగాడు సినిమాలో యాక్షన్ సన్నివేశాలతోనూ టార్గెట్ చేసిన మాస్ ప్రేక్షకులతో ఈలలు వేయించాడు. పూరి జగన్నాధ్, వినాయక్ లాంటి చేతిలో పడితే శౌర్య రాత్రికి రాత్రే  స్టార్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చివరాఖరుకి చెప్పొచ్చేదేమిటంటే మాస్ కిరీటానికి ఎంట్రీ లెవెల్ లో శౌర్య మంచి మార్కులే సంపాదించుకున్నాడు.  
Tags:    

Similar News