• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : 'లవ్...

పిక్ టాక్‌ : 'లవ్ స్టోరీ'కి చైతూ థ్యాంక్యూ

By - Tupaki Desk
Update: 2021-09-30 09:33 GMT
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా లవ్‌ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈమద్య కాలంలో చైతూకు దక్కిన బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ లవ్‌ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఒక మంచి సోషల్‌ మెసేజ్ తో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు వచ్చి బిగ్గెస్ట్‌ సక్సెస్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది.

బాలీవుడ్‌ సినిమాలు కూడా పది కోట్లు పదిహేను కోట్లు కూడా రాబట్టలేక పోతున్న సమయంలో ఈ సినిమా భారీ మొత్తంలో వసూళ్లు నమోదు చేస్తుంది. లవ్‌ స్టోరీ సినిమా షూటింగ్‌ సమయంలోనే భారీ అంచనాలను కలిగి ఉంది. ఆ అంచనాలను అందుకోలేక పోయిందని కొందరు కామెంట్స్ చేసినా కూడా చివరకు వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే లవ్‌ స్టోరీ మంచి సక్సెస్ ను దక్కించుకున్నట్లే అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో యూనిట్‌ సభ్యులు సక్సెస్ వేడుకల్లో ఉన్నారు.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులతో నాగచైతన్య తన సక్సెస్‌ ను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ సందర్బంగా నాగచైతన్య చిత్ర యూనిట్‌ సభ్యులతో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో చైతూ షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సక్సెస్ కు సహకరించిన యూనిట్‌ సభ్యులందరికి కూడా థ్యాంక్యూ అంటూ ఈ ఫొటోకు చైతూ కామెంట్ పెట్టాడు. నాగచైతన్య మరియు సాయి పల్లవి లు ఈ ఫొటోలో సక్సెస్ జోష్ లో కనిపిస్తున్నారు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీరిద్దరు మళ్లీ మళ్లీ కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య మరియు సాయి పల్లవిల లవ్ స్టోరీ మరియు రొమాన్స్ చాలా సహజంగా ఉందని.. ఇద్దరు స్టార్స్ కనిపించకుండా రేవంత్ మరియు మౌనికలు మాత్రమే లవ్‌ స్టోరీలో కనిపించారు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక నాగచైతన్య తదుపరి సినిమాల విషయానికి వస్తే విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నటించిన థ్యాంక్యూ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాను కూడా చైతూ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు అమీర్ ఖాన్‌ హీరోగా నటించిన లాల్‌ సింగ్‌ చద్దా లో కూడా చైతూ కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ మూడు సినిమాలు కాకుండా వచ్చే ఏడాదిలో మరో రెండు సినిమాలను కూడా చైతూ చేసే అవకాశాలు ఉన్నాయి.


Tags:    
  • love story 
  • movie 
  • nagachaithanya 
  • Sai pallavi 
  • Shekar kamula 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS