• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమమ్ ఆగస్టు 12న పక్కా

ప్రేమమ్ ఆగస్టు 12న పక్కా

By - Tupaki Desk
Update: 2016-07-04 10:04 GMT
ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్ పోటీకి దిగుతారంటే చాలామంది నమ్మలేదు. అలాగే నాన్నకు ప్రేమతో-సోగ్గాడే చిన్నినాయనా-డిక్టేటర్ లాంటి భారీ సినిమాలు లైన్లో ఉండగా.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లాంటి మీడియా రేంజి సినిమా వాటితో పోటీ పడుతుందన్నా చాలామంది నమ్మడానికి ఇష్టపడలేదు. కానీ చివరికి బాలయ్య-ఎన్టీఆర్ తలపడ్డారు.. ఎక్స్ ప్రెస్ రాజా కూడా రేసులో నిలిచింది. అంత పోటీలో కూడా సంక్రాంతి సినిమాల్లో మూడు సినిమాలు బాగా ఆడాయి. ఒకటి పర్వాలేదనిపిచకుంది. కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి కానీ.. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజైనా ఇబ్బందేమీ ఉండదనడానికి ఇది రుజువు. ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’తో ‘ప్రేమమ్’ పోటీ పడే విషయంలోనూ జనాలకు ఏవైనా సందేహాలుంటే తొలగించుకోవాల్సిందే అని స్పష్టమవుతోంది.

ఆగస్టు 12న ‘ప్రేమమ్’ విడుదల కావడం పక్కా అంటున్నారు ప్రేమమ్ టీమ్ . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తున్నామని.. ఆగస్టు 12నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని చందూ తెలిపారు. ఒకవేళ రజినీకాంత్ సినిమా ‘కబాలి’ జులైలో విడుదల కాకుండా వెనక్కి వెళ్తే తప్ప ‘ప్రేమమ్’ అనుకున్న ప్రకారమే ఆగస్టు 12న వచ్చేస్తుందన్నది ఆ చిత్ర వర్గాల సమాచారం. ‘జనతా గ్యారేజ్’ భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నప్పటికీ ‘ప్రేమమ్’ను దానికి పోటీగా రిలీజ్ చేయడానికి వెనుకాడట్లేదంటేనే ఈ సినిమా మీద దర్శక నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్థమవుతుంది. మలయాళ వెర్షన్‌ కు ఏమాత్రం తగ్గని స్థాయిలో తెలుగు ‘ప్రేమమ్’ను తీర్చిదిద్దాడట చందూ. హీరో చైతూ.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సినిమా ఔట్ పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారట. ‘ప్రేమమ్’ తెలుగులోనూ మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని యూనిట్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఈ సినిమా విడుదల విషయంలో మున్ముందేమైనా ట్విస్టులుంటాయేమో కానీ.. ప్రస్తుతానికైతే ఆగస్టు 12న ఎన్టీఆర్-చైతూ బిగ్ ఫైట్ పక్కా అని ఫిక్సవచ్చన్నమాట.
Tags:    
  • Naga Chaitanya 
  • Premam Movie 
  • Telugu NEWs 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS