• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ గ్యాంగ్...

చైతూ గ్యాంగ్ అదరగొట్టిందిగా..

By - Tupaki Desk
Update: 2016-10-03 07:00 GMT
దసరా సందడి సమయం దగ్గర పడుతోంది. ఆశ్చర్యకరంగా ఈసారి ఏకంగా ఐదు సినిమాలు దసరా రేసులో నిలిచాయి. అందులో అత్యంత ఆసక్తి రేపుతున్నది ప్రేమమ్ సినిమానే అనడంలో సందేహం లేదు. మలయాళ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన ‘ప్రేమమ్’ సినిమాకు రీమేక్ కావడం ఈ సినిమా మీద మన ప్రేక్షకులకు ఆసక్తి కలగడానికి ఓ ప్రధాన కారణమైతే.. అక్కినేని నాగచైతన్య.. శ్రుతి హాసన్ లాంటి తారలు నటించడం.. చందూ మొండేటి లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు ఈ సినిమాను రూపొందించడం.. ఆ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలన్నీ కూడా పాజిటివ్ ఫీల్ కలిగించాయి. ఇక రిలీజ్ వీక్ లోకి అడుగు పెట్టేయడంతో ‘ప్రేమమ్’ టీమ్ ప్రమోషన్ జోరు కూడా పెంచింది. చైతూ ఆల్రెడీ ఇంటర్వ్యూలు మొదలుపెట్టాడు. త్వరలోనే మీడియా వాళ్లందరినీ కలవబోతున్నాడు. చందూతో పాటు మిగతా వాళ్లు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి కొత్త సిల్స్ తో వదులుతున్న పోస్టర్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తాజాగా నాగచైతన్య అండ్ గ్యాంగ్ వైట్ అండ్ వైట్లో నడిచి వస్తున్న పోస్టర్ ఒకటి వదిలారు. ఆ మధ్య ‘సోగ్గాడే చిన్నినాయనా’ రిలీజ్ ముందు నాగార్జున.. చైతూ.. అఖిల్ కలిసి ఇలాగే వైట్ అండ్ వైట్లో ఫొటోలకు పోజులిచ్చారు. దాన్ని తలపిస్తోంది ఈ కొత్త పోస్టర్. ఈ సినిమాలో చైతూ స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి.. చైతన్య కృష్ణ.. ప్రవీణ్ నటిస్తున్నారు. వాళ్లు కూడా వైట్ అండ్ వైట్లో రెడీ అయిపోయారు. మలయాళంలో హీరో.. అతడి ఫ్రెండ్స్ లుంగీలేసుకుని కాలేజీకి వస్తారు. ఇక్కడ దాన్ని వైట్ అండ్ వైట్ కు మార్చినట్లున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Naga Chaitanya 
  • Premam Movie 
  • Telugu News 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS