• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  222 రోజులు.. చైతూ బీట్...

222 రోజులు.. చైతూ బీట్ చేస్తాడా?

By - Tupaki Desk
Update: 2016-01-10 04:13 GMT
2015 సౌత్ ఇండ‌స్ర్టీ బ్లాక్‌ బ‌స్ట‌ర్స్‌ లో ప్రేమ‌మ్ ఒక‌టి. ఆల్ఫోన్స్ పుథీర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మ‌ల్లూవుడ్‌ లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అన్ని ఇండ‌స్ర్టీస్‌ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అందుకే ఈ సినిమాపై అన్ని ప‌రిశ్ర‌మ‌ల నుంచి హీరోలంతా మ‌న‌సు పారేసుకున్నారు. ముఖ్యంగా తెలుగ హీరో నాగ‌చైత‌న్య వెంట‌ప‌డి మ‌రీ కొనుక్కున్నాడు. చందు మొండేటి చేత స్ర్కిప్టును అనువ‌దింప‌జేసుకుని సెట్స్ కెళ్లాడు. ష్యూర్ షాట్‌ గా హిట్ కొట్టేస్తా అన్న న‌మ్మ‌కంతో ఈ సినిమా కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తున్నాడు. డే అండ్‌ నైట్‌ శ్ర‌మించేందుకు వెన‌క‌డాడం లేదు. ఒకే క్యారెక్ట‌ర్‌ లో మూడు వేరియేష‌న్స్‌ - మూడు ద‌శ‌ల్ని చూపించాలంటే బోలెడంత ఫిజిక‌ల్ శ్ర‌మ అవ‌స‌రం. ఆ ప‌నుల‌న్నీ చేస్తున్నాడు. అయితే చైతూ ప‌డుతున్న శ్ర‌మ రియాలిటీలో ఫ‌లిస్తుందా? అన్న‌దే ప్ర‌స్తుతం వెయ్యి డాల‌ర్ల ప్ర‌శ్న‌.

నివిన్ పౌళీ న‌టించిన ప్రేమ‌మ్ ఇప్ప‌టికీ  థియేట‌ర్ల‌లో ఆడుతోంది. ముఖ్యంగా నాన్ లోక‌ల్ అయిన త‌మిళ‌నాడులో ఓ థియేట‌ర్‌ లో రికార్డు వ‌సూళ్లు చేస్తోంది. ఇప్ప‌టికీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఆడేస్తోంది ఈ సినిమా. చెన్న‌య్ న‌గ‌రంలో ఉన్న మ‌ల‌యాళీలు మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్‌ కి వెళ్లి చూస్తుండ‌డం సిటీలో చ‌ర్చ‌కొచ్చింది. ఇప్ప‌టికి 222 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజ‌యంగా కొన‌సాగుతోందింకా. అందుకే ఈ స్థాయి విజ‌యం, ఈ స్థాయి ఐడెంటిటీ  చైతూ న‌టిస్తున్న ఈ రీమేక్ వెర్ష‌న్‌ కి కూడా ద‌క్కుతుందా?  చైతూకి కూడా మాతృక‌లోని హీరోకి వ‌చ్చినంత గుర్తింపు వ‌స్తుందా? ఇలాంటి య‌క్ష‌ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం ప్రాక్టిక‌ల్‌ గా రావాల్సి ఉంది మ‌రి. అదంతా చైతూ- మొండేటి చేతిలోనే ఉంది మ‌రి. ఏం చేస్తారో చూడాలి.
Tags:    
  • Naga CHaitanya 
  • Premam Remake 
  • Telugu NEWs 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS