• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్నార్ గా చైతు...

ఎన్నార్ గా చైతు ఒదిగిపోయాడుగా!!

By - Tupaki Desk
Update: 2018-05-10 12:43 GMT
నిన్న విడుదలైన మహానటి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. తెరనిండా నటీనటులు ఉన్నా ఎక్కడ డైవర్ట్ కాకుండా దర్శకుడు నాగ అశ్విన్ టేకప్ చేసిన తీరుకి అందరు హాట్స్ ఆఫ్ చెబుతున్నారు. విడుదలకు ముందే కీలక పాత్రలకు సంబంధించి ఎవరెవరు ఏ వేషం వేసారు అనేది నాని వాయిస్ ఓవర్ తో చిన్న టీజర్స్ రూపంలో విడుదల చేసిన యూనిట్ ఎన్టీఆర్-ఎఎన్ఆర్ లవి మాత్రం రివీల్ చేయలేదు. నిన్న రిలీజ్ అయ్యాక సీక్రెట్ బయట పడింది కనక అవి కూడా విడుదల అయ్యాయి. ఎన్టీఆర్ ది గ్రాఫిక్ తో కూడిన సన్నివేశంతో మేనేజ్ చేసారు కాని ఎఎన్ఆర్ పాత్రను మాత్రం నాగ చైతన్య చేయటం ఆకర్షణగా నిలిచింది. దేవదాసు రోజుల నాటి మీసకట్టు బెల్ బాటం ప్యాంట్ తో అచ్చం తాత గారిని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసిన నాగ చైతన్యకు దొరికింది కొన్ని సీన్లే కాబట్టి ఎలా చేసాడు అనేది జడ్జ్ చేయటం కూడా కరెక్ట్ కాదు.

అక్కినేని నాగేశ్వర్ రావు గారిలా నాగార్జున ఏ సినిమాలోనూ ఇలా పునఃప్రవేశం చేసే ప్రయత్నం చేయలేదు. మనవడు నాగ చైతన్య మాత్రం ఆ సాహసం చేసాడు. లైఫ్ పార్టనర్ సమంతా కీలక పాత్ర వహించిన సినిమాలో చైతు ఇలా స్పెషల్ క్యామియో అందులోనూ తాత గారిలా నటించడం చాలా థ్రిల్ ఇచ్చి ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే చైతు సాం ఒకే సినిమాలో ఉన్నా కూడా ఇద్దరికీ ఒక్క కాంబో సీన్ కూడా లేకపోవడం. అది కథ ప్రకారమే అయినప్పటికీ వెరైటీ అనుకోవచ్చు. దాంతో పాటు చైతన్య సమంతా కలిసి నటించిన సినిమాల్లో సాం వేరొక హీరోకు జోడిగా ఉండటం కూడా ఇదే మొదటిసారి. మొత్తానికి అటు చైతుకి ఇటు సాంకి ఒక స్వీట్ మెమరీలా మిగిలిన మహానటి ప్రభంజనం మహా జోరుగా ఉంది. ఓవర్సీస్ లో హల్చల్ చేస్తుండగా ఈ వీక్ ఎండ్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా పికప్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. వసూళ్లు కూడా అదే ఋజువు చేస్తున్నాయి.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Naga Chaitanya 
  • ANR 
  • Mahanati movie 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS