• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమహేంద్రవరంతో తనకున్న...

రాజమహేంద్రవరంతో తనకున్న సెంటిమెంట్ చెప్పేసిన చైతూ

By - Tupaki Desk
Update: 2022-01-19 03:33 GMT
సంక్రాంతి పండుగ ఉత్సాహమంతా అక్కినేని కుటుంబంలో కనిపిస్తోంది. తెలుగు వారి పెద్ద పండక్కి సినిమాల విందు ఉంటుంది. ఈసారి కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్త భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ముందుగా పండక్కి రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలన్ని ఆగిపోగా.. అనూహ్యంగా తెర మీదకు కొన్నిచిత్రాలు రావటం తెలిసిందే. అలా వచ్చి.. మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నచిత్రం.. బంగార్రాజు. ప్రస్తుతం ఆ మూవీ విజయాన్నిఎంజాయ్ చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ.

ఓవైపు ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీ.. మరోవైపుకరోనా కేసులు.. ఇంకోవైపు సినిమా హాలుకు వెళ్లి సినిమా చూడాలా?అన్న సందేహాల నేపథ్యంలో ధైర్యంగా సినిమాను విడుదల చేసి.. ప్రేక్షకుల సినిమా ఆకలిని తీర్చింది అక్కినేని కుటుంబం. వారి ధైర్యానికి.. సాహసానికి తగ్గట్లు.. విజయం వారి ఖాతాలో పడింది.తాజాగా రాజమహేంద్రవరంలో బంగార్రాజు మూవీ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జునతో పాటు నాగచైతన్య.. ఏపీ మంత్రి కురసాల కన్నబాబు.. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ తదితరులు అతిధులుగా హాజరయ్యారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ఆసక్తికర అంశాన్నిచెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరంతో తనకుప్రత్యేకమైన సెంటిమెంట్ ఏర్పడినట్లు చెప్పారు. సినిమా షూటింగ్ కు వచ్చినా.. ఏదైనా వేడుకకు రాజమహేంద్రవరానికి వస్తే అది  సూపర్ హిట్టేనని పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితుల్లో సినిమాను చూస్తారా? లేదా? అన్న సందేహంతోనే విడుదల చేసినట్లు చెప్పారు.

ప్రేక్షకుల్ని.. కథను నమ్మి ముందు అడుగు వేశామని.. ఇంతటి ఆదరణ చూపిస్తారని తాను ఊహించలేదన్నారు. ‘‘మీరు.. మా కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ చూపించారు. బెస్ట్ కలెక్షన్లను చూపించబోతున్నారు.

ఇందుకుజీవితాంతం మీ అందరికి రుణపడి ఉంటా. మంచి టీమ్ వల్లే అతి తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేయగలిగాం. పండుగకు సినిమా హిట్ అందుకుంటే ఎలా ఉంటుందో నాన్న నాకు చూపించారు’’ అంటూ చైతూ వ్యాఖ్యానించారు. ఎన్నో టెన్షన్ల మధ్య బంగార్రాజును విడుదల చేసినందుకు తామెంత హ్యాపీగా ఉన్నామన్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేశారు నాగచైతన్య.
Tags:    
  • BlockbusterBangarraju 
  • Bangarraaju 
  • ChayAkkineni 
  • Nagarjuna 
  • KrithiShetty 
  • BangarrajuOnJan14th 
  • BangarrajuMania 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS