• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ.. అతనొక్కడికే గ్రీన్...

చైతూ.. అతనొక్కడికే గ్రీన్ సిగ్నలిచ్చాడు

By - Tupaki Desk
Update: 2017-05-26 05:45 GMT
సొంత బేనర్లో ‘రారండోయ్ వేడుక’ పూర్తి చేసిన అక్కినేని నాగచైతన్య.. ఈ సినిమా పని ముగించగానే కృష్ణ అనే కొత్త దర్శకుడితో ఓ థ్రిల్లర్ మూవీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బేనర్ మీద సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇది రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ అని సమాచారం. ఈ సినిమా ఇంకో రెండు నెలల్లోనే పూర్తయిపోతుంది. మరి చైతూ దీని తర్వాత చేయబోయే సినిమా ఏదనే విషయంలో కొన్నాళ్ల నుంచి రకరకాల రూమర్లు వినిపించాయి. ‘ప్రేమమ్’ సూపర్ సక్సెస్ అయ్యాక చైతూ కోసం చాలామంది దర్శకులు.. నిర్మాతలు ప్రయత్నించారు. కానీ చైతూ అప్పటికే కమిటైన సినిమాల మీద దృష్టిపెట్టాడు తప్ప.. వేరే కమిట్మెంట్లు ఏమీ ఇవ్వలేదు.

తాజాగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ప్రమోషన్లలో భాగంగా చైతూ మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చేస్తున్న థ్రిల్లర్ మూవీ కాకుండా చైతూ కమిట్మెంట్ ఇచ్చింది ఒక్క చందూ మొండేటికేనట. చందూ తనకు ఒక లైన్ చెప్పాడని.. అది నచ్చిందని.. దాని మీద వర్కవుట్ చేయమని చెప్పానని.. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుందని చైతూ తెలిపాడు. ఇది కాక ఇంకెవరికీ తాను ఓకే చెప్పలేదని చైతూ అన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణతో ఇంతకుముందు అనుకున్న సినిమా వర్కవుట్ కాలేదని.. ఆయనతో ఓ సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని చైతూ తెలిపాడు. ఇంకో రెండు మూడు ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతున్నాయని.. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తానని చైతూ చెప్పాడు. కాబట్టి ‘ప్రేమమ్’ కాంబినేషన్ రిపీటవ్వడం పక్కా అన్నమాట. ఈసారి వీళ్లిద్దరూ డైరెక్ట్ మూవీనే చేయబోతున్నారు. మరి చందూ నిఖిల్‌తో కార్తికేయ-2ను ముందు మొదలుపెడతాడా.. లేక చైతూ సినిమానే ముందు పట్టాలెక్కిస్తాడా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Naga Chaitanya 
  • Chandoo Mondeti 
  • Telugu NEws 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS