కరోనా రోగం అదో నరకం.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. కోలుకున్నాక అభిప్రాయాలు పంచుకున్న నాగబాబు

Update: 2020-10-28 06:30 GMT
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ప్రముఖ నటుడు నాగబాబు.. తన అనుభవాలను అభిమానులతో షేర్​ చేసుకున్నాడు. కరోనాతో బాధపడుతూ నరకం అనుభవించానని.. ఒక్కోసారి ఊపిరికూడా సరిగ్గా ఆడకపోయేదని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చినా.. చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ వ్యాధిని తేలికగాతీసుకోవద్దని.. ఒకవేళ కరోనా సోకినా ఆందోళన చెందవద్దని వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ .. మందులు వాడితే నయమవతుందని చెప్పారు.   ఇంకా ఆయన ఏమన్నారంటే..

‘నేను కరోనాను జయించిన యోధుడిని  అని చెప్పుకోవడం లేదు.  కేవలం ఓ అంటువ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తిని మాత్రమే. నేను ఆస్తమా పేషెంట్​ను. అందువల్ల కరోనాతో ఎక్కువగా ఇబ్బంది పడ్డా.  వెంటనే ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్​వార్డులో చేరాను. మొదట్లో కొన్నిసార్లు ఊపిరి అందకపోయేది. దీంతో నరకం అనుభవించా. మూడో రోజుకే వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయా. వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడి మహమ్మారిని జయించా. డిశ్చార్జ్  అయ్యి ఇంటికి వచ్చాక వారం పాటు  ఐసోలేషన్​లో ఉన్నాను.

 ఇంటికొచ్చే సమయానికి నా భార్యకు కూడా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో మేమిద్దరం ఐసోలేషన్​లోనే ఉండిపోయాం. ఆ సమయం మాకు ఎంతో కఠినమైంది. నా భార్య నాకంటే తొందరగా కోలుకుంది. అందుకు కారణం ఆమెకు ఉన్న ఇమ్యూనిటీ కావచ్చు. నాకు మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టింది. నేను అందరికీ ఒకటే సలహా ఇస్తున్నా. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి. ప్రతి ఒక్కరూ కరోనా నుంచి కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. వైద్యులు చెప్పే సూచనలు పాటించి వాళ్లు ఇచ్చే మందులు వేసుకోండి. అప్పడే కరోనా నుంచి జయిస్తారు’ అంటూ నాగబాబు తన అభిప్రాయాలను తెలియజేశారు.
Tags:    

Similar News