ప్రభాస్ మూవీ అప్డేట్స్ ఇవ్వను.. అలా ఇవ్వడం కరెక్ట్ కాదుః దర్శకుడు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలితో నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఆ తర్వాత నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ కిట్ లో నాలుగు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ తెరకెక్కుతూనే ఉంది. ఇంకో వైపు ‘ఆదిపురుష్’ కూడా మొదలైంది. ఈ మూడు చిత్రాల తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్ పైకి రానుంది. ఈ నాలుగు చిత్రాల్లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి.
అయితే.. మిగిలినమూడు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నప్పటికీ.. నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రావట్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచడంతోపాటు సినిమాలు ఎంత వరకు వచ్చాయి? అనే వివరాలను ఆ మూడు చిత్రాలు అందిస్తున్నాయి. మరి, నాగ్ అశ్విన్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు? అనే చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఈ చిత్రం గురించిన అప్డేట్స్ ఇప్పుడే ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాడు. ప్రస్తుతం “రాధే శ్యామ్” రిలీజ్ ఉంది కాబట్టి ఈ సమయంలో మిగిలిన ప్రాజెక్టుల చర్చ సరికాదని నాగ్ అశ్విన్ ఉద్దేశం. “ఆదిపురుష్” షూట్ కొంత జరిగిన తర్వాత తన సినిమా గురించి అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. నాగ్ అశ్విన్ నిర్ణయం సరైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు విడుదలయ్యే చిత్రంపై డిస్కషన్ ఎక్కువగా ఉంటేనే.. హైప్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతో.. కలెక్షన్స్ కూడా ఎక్కువ రాబట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట.