స్టార్ హీరోతో నాంది బాలీవుడ్ రీమేక్..!

Update: 2021-06-25 14:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలకాలం తర్వాత రొటీన్ సినిమాల పంథా మారిపోయింది. ఇంతకాలం కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమాలను తెరకెక్కించిన మేకర్స్.. ఈ మధ్య ఎమోషనల్ రియాలిస్టిక్ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. అలాంటి ప్రయత్నాలలో ఒకటిగా సక్సెస్ అందుకున్న చిత్రం నాంది. అల్లరి హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన నాంది.. విడుదలకు ముందునుండి కంటెంట్ విషయంలో ఫస్ట్ లుక్ - ట్రైలర్ వరకు అన్ని సినిమా పై అంచనాలు పెంచేసాయి.

ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమాలో నరేష్ బరువవైన పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమైంది. సోషల్ ఇష్యూ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన నాంది సినిమా న్యాయవ్యవస్థలోని లూపుహోల్స్ బయట పెట్టే ప్రయత్నం చేసింది. సతీష్ వేగేష్న ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో విజయ్ కనకమేడల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి సినిమాలన్ని వేరే భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాంది సినిమాను కూడా రీమేక్ చేస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ ప్రకటించాడు.

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి అజయ్ దేవగన్ కూడా ఈ రీమేక్ సినిమాను నిర్మించనున్నాడు. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెళ్లాడిస్తామని తెలిపాడు. అయితే సినిమా గురించి అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. నాంది అనేది ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ మూవీ. న్యాయవ్యవస్థలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపే ప్రయత్నం చేసింది. తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎమోషనల్ కూడా టచ్ చేసింది. కాబట్టి ఈసారి నాంది సినిమాను మరింత ఎక్కువమందికి చేరేలా చేయడానికి నేను దిల్ రాజు ప్లాన్ చేసాం. స్క్రిప్ట్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. ఒకసారి కాస్ట్ సెలక్షన్ అయిపోతే స్టార్ట్ చేస్తాం." అంటూ అజయ్ దేవగన్ ప్రకటించారు.
Tags:    

Similar News