• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా: కెనడా షోల రద్దు...

సైరా: కెనడా షోల రద్దు వెనక పెద్ద కథ?

By - Tupaki Desk
Update: 2019-10-05 17:49 GMT
కెనడా దేశంలో ఒంటారియో ప్రావిన్స్ లో 'సైరా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లలో ఒక ఆగంతకుడు సినిమా స్క్రీన్ ను చింపడం.. ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే చల్లడం ఓవర్సీస్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ముందుజాగ్రత్త చర్యగా సైరా ప్రదర్శిస్తున్న థియేటర్లలో షోల ప్రదర్శనలు రద్దు చేయడంతో ఈ ఇష్యూపై అందరి దృష్టి పడింది. వీకెండ్ సమయంలో ఇలా జరగడంతో డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలు తప్పేలా లేవు.

అయితే ఇదంతా జరగడానికి వెనక చాలా పెద్ద కథే ఉందన్న టాక్  ఓవర్సీస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  వివరాల్లోకి వెళ్తే.. మిగతా ఓవర్సీస్ ఏరియాలకు కెనడాలో డిస్ట్రిబ్యూషన్ కు తేడా ఉందట.  కెనడాలో డిస్ట్రిబ్యూషన్ కొందరి గుప్పిట్లో ఉందని.. వారిలో ముఖ్యంగా కొందరు తెలుగు.. తమిళ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని సమాచారం.  అయితే ఈ డిస్ట్రిబ్యూటర్లది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఇంతకాలం సాగుతూ వచ్చిందట.  కలెక్షన్స్.. టాక్సుల లెక్కలు కూడా వారు ఎంత చెప్తే అంతేనట.. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న నిర్మాతలకు అసలు కలెక్షన్ల లెక్కలు ఎంతో తెలియడం లేదట. ఆ డిస్ట్రిబ్యూటర్ల ఓ రింగుగా ఫామ్ అయ్యేసరికి నిర్మాతలు ఎవరూ వారి జోలికి పోవడం లేదట.  

అయితే 'సైరా' విషయం లో మాత్రం భిన్నంగా జరిగిందని.. ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు రైట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మల్టిప్లెక్స్ చెయిన్ కు పంపిణీ హక్కులు ఇచ్చారని సమాచారం. ఇది 'సైరా' నిర్మాతలకే కాకుండా ఇతర తెలుగు.. తమిళ నిర్మాతలకు కూడా మంచి జరిగే విషయమట.  ఎందుకంటే సైరా ఫుల్ రన్ కలెక్షన్స్.. థియేటర్ల కౌంట్ కనుక చూస్తె అసలు కెనడాలో కలెక్షన్స్ పరిస్థితిపై నిర్మాతలందరికీ ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందట.   దీంతో ఒక ముఠాగా ఏర్పడి నిర్మాతలకు నష్టం చేకూరుస్తున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ స్క్రీన్ లు చింపడం.. పెప్పర్ స్ప్రే దాడి లాంటివి తెలివిగా ప్లాన్ చేసి.. టోటల్ గా 'సైరా' వీకెండ్ షోలు రద్దయ్యే  పరిస్థితికి తీసుకొచ్చారట.  దీంతో ఇప్పుడు కూడా కెనడాలో తెలుగు తమిళ సినిమాల కలెక్షన్స్ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేని పరిస్థితే కొనసాగుతుంది.  అక్కడ ముఠాగా ఏర్పడిన వారి ఆటలే చెల్లుతాయి.   ఒకవేళ ఈ వెర్షన్ కనుక నిజమైన పక్షంలో టాలీవుడ్ నిర్మాతలు ఈ విషయంపై సీరియస్ గా దృష్టిసారించాల్సిన అవసరమైతే ఉంది.
Tags:    
  • Mystery 
  • Sye Raa Shows 
  • Cancelled 
  • Canada 
  • Telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS