ర‌చ‌న నా ఆయుధం అదే న‌న్ను హీరోగా నిల‌బెట్టింది

Update: 2021-04-07 02:30 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్రేజీ హీరోగా వెలిగిపోతున్న అడివి శేష్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ `మేజ‌ర్`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 26/11 ఎటాక్స్ అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ బ‌యోపిక్ ఇది. తెలుగు- హిందీతో పాటు ఈ చిత్రం మలయాళంలో కూడా విడుదల కానుంది.

ఈ సినిమాలో క‌థానాయ‌కుడిగా నటించడంతో పాటు ఈ మూవీకి స్క్రిప్టు‌ను కూడా శేష్ అందించారు. క్ష‌ణం- గూఢ‌చారి- కిస్ లాంటి చిత్రాలకు అత‌డు స్క్రిప్ట్ అందించాడు. రచయితగా ఉండటం నటుడిగా అతని ఎంపికలను ప్రభావితం చేస్తుందా? అంటే..  కెరీర్ ప్రారంభంలో రాయడం త‌ప్ప‌నిస‌రి అయ్యేది. ఎందుకంటే మనకు ఒక కథ నచ్చినప్పుడు మనం తెరపై దానిని చూడాలనుకుంటాం. అయినా నేను ఆ రకమైన సినిమాలు హీరోగా పొందలేకపోయాను. నేను సినిమాల్లో బయటి వ్యక్తిని. ఏం చేయాలో తెలీదు. అందుకే అనేక విధాలుగా రచన నా ఆయుధంగా మారింది. క‌లంతో నేను యుద్ధానికి వెళ్ళగలను. కానీ చివరికి అది నా నటనా వృత్తికి ఉప‌యోగ‌ప‌డింది అని శేష్ తెలిపారు.

నేను ఒక కథను వింటున్నప్పుడు లేదా ఒక చిత్రాన్ని చూస్తున్నప్పుడు అది ఏదో ఒకవిధంగా లేదా అవాస్తవంగా అనిపిస్తుంది. అలాగ‌ని నేను రాసిన వాటిలోనే నేను న‌టించాల‌నుకోవ‌డం లేదు. ఎందుకంటే అప్పుడు మ‌ళ్లీ ఒకే మూస‌లో ఒదిగిపోతాను.  దాంతో నా క‌థ ముగుస్తుంది! అని నిజాయితీగా అంగీక‌రించారు. నేను రాసేవి నాకు ఈజీ . నాలోని రచయిత నాలోని నటుడిని పరిమితం చేయనివ్వకుండా ప్రయత్నిస్తాను.. అని శేష్ తెలిపారు.

అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న‌ప్పుడు తాను పంజాబీ నేర్చుకున్నాన‌ని .. త‌నతో ఎవ‌రైనా పంజాబీ మాట్లాడినా.. తిట్టినా తెలిసిప‌తుంద‌ని తాను మాట్లాడ‌గ‌ల‌న‌ని కూడా శేష్ ఓ జాతీయ మీడియా చాటింగులో వెల్ల‌డించారు.
Tags:    

Similar News