నా 50 ఏళ్ల సంపాదన ఆమె 2 ఏళ్ల సంపాదన సమానం

Update: 2021-11-04 10:30 GMT
ఒకప్పుడు సినిమాల మేకింగ్ వేలల్లో లక్షల్లో ఉండేది. కాని ఇప్పుడు కోట్లు దాటి వందల కోట్లలో ఉంటుంది. పాతిక ఏళ్ల క్రితం వరకు పారితోషికాలు వేలు.. మహా అయితే లక్ష రెండు లక్షలు ఉండేది. కాని ఇప్పుడు పారితోషికాలు భారీగా పెరిగి పోయాయి. అప్పట్లో సినిమాల్లో నటించిన వారు పెద్దగా సంపాదించుకోలేక పోయారు. కాని ఇప్పుడు నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున పారితోషికాలు అందుకుంటూ పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదనను దక్కించుకుంటున్నారు. ఒక స్టార్‌ హీరో పాతిక ఏళ్లు దాదాపుగా వందకు పైగా సినిమాలు 1990 కి ముందు వరకు చేసి ఆయన కెరీర్‌ మొత్తం లో సంపాదించింది ఇప్పుడు కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్‌ హీరోలు సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 నుండి 100 కోట్లు కూడా తీసుకుంటున్న వారు ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా భారీగా వసూళ్లు సంపాదిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్‌ భట్ ఇదే విషయాన్ని తెలియజేశాడు.

మహేష్‌ భట్ కూతురు ఆలియా భట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ ల జాబితాలో టాప్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన నటనతో పాటు అందం ఇంకా అన్ని రకాలుగా ప్రత్యేకతలు ఉన్న ముద్దుగుమ్మ ఆలియా భట్‌. కనుక ఆమె వరుసగా సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తోంది. ఈమద్య కాలంలో స్టార్స్ సినిమాలతో మాత్రమే కాకుండా కమర్షియల్‌ యాడ్స్ ద్వారా.. సోషల్ మీడియా ద్వారా ఇంకా ఇతర విధానాల ద్వారా కూడా సంపాదన దక్కించుకుంటున్నారు. అలా ఆలియా భట్ సంపాదన ఇప్పడు పెద్ద మొత్తంలో పెరిగింది. ఆలియా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా దశాబ్దం అవుతోంది. ఈ దశాబ్ద కాలంలో భారీ ఎత్తున సంపాదించడంతో పాటు పెద్ద మొత్తంలో ఆమె క్రేజ్ ను దక్కించుకుంది.

ఇటీవల ఆలియా భట్ తండ్రి మహేష్‌ భట్‌ ఒక టాక్ షో లో మాట్లాడుతూ తన కూతురు సంపాదన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా 50 ఏళ్ల సినీ కెరీర్ లో నేను సంపాదించిన మొత్తం నా కూతురు రెండు ఏళ్ల సంపాదన సమానం అంటూ వ్యాఖ్యలు చేశాడు. నా కూతురు అభివృద్ది మరియు ఆమె సక్సెస్‌ కు చాలా సంతోషంగా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. 50 ఏళ్లలో మహేష్‌ భట్ ఎన్నో సూపర్ హిట్స్ ను అందించాడు. అయితే అప్పట్లో ఆయన అందుకున్న పారితోషికాలు చాలా తక్కువ. కనుక ఆయనకు భారీ ఎత్తున ఆస్తులను అయితే సంపాదించలేదు. కాని ఇప్పుడు ఆయన కూతురు మాత్రం పెద్ద ఎత్తున సంపాదిస్తుంది. ఇదే విషయాన్ని ఆయన తనదైన స్టైల్‌ లో చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News