• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #సుశాంత్.. మా ద‌ర్యాప్తు...

#సుశాంత్.. మా ద‌ర్యాప్తు స‌రైన‌దేన‌ని తేలిందన్న ముంబై పోలీస్

By - Tupaki Desk
Update: 2020-10-04 03:45 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఒక్కో ట్విస్టు సినిమాటిక్ అప్పియ‌రెన్స్ తో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తెలుసుకునేందుకు సీబీఐ బ‌రిలో దిగి ద‌ర్యాప్తును సాగిస్తోంది. ఇక ఈ కేసులో ప్ర‌ఖ్యాత ఎయిమ్స్ ఫోరెన్సిక్ రీపోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించ‌డం తెలిసిన‌దే. అయితే ఇది హ‌త్య కాదు అంటూ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖండించ‌డం త‌మ గెలుపు అని  ముంబై పోలీసులు ప్ర‌క‌టించారు. త‌మ దర్యాప్తులో చిత్త‌శుద్ధి నిరూపిత‌మైందని నగర పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ శనివారం తెలిపారు.

దర్యాప్తు గురించి ఏమీ తెలియకుండానే `స్వార్థ ప్రయోజనాలు` ఉన్న కొందరు ముంబై పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన జాతీయ మీడియాతో అన్నారు. రాజ్ ‌పుత్ ఆత్మహత్య చేసుకున్నార‌ని.. ఇది హత్య కాదని ఎయిమ్స్ వైద్య బోర్డు శనివారం పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన పోలీస్ క‌మీష‌న‌ర్ సింగ్ నగర పోలీసుల దర్యాప్తు నిబ‌ద్ధ‌త‌తో సాగింద‌ని.. శవపరీక్ష నిర్వహించిన నగరంలోని కూపర్ ఆసుపత్రి వైద్యులు కూడా తమ పనిని పూర్తి శ్ర‌ద్ధ‌గా చేశారని చెప్పారు. `ఎయిమ్స్` ఫలితాల ద్వారా ప్ర‌తిదీ నిరూప‌ణ అయ్యింద‌ని తెలిపారు.

రాజ్ ‌పుత్ కేసులో బీహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్ బదిలీని సుప్రీంకోర్టు సమర్థించింది. ముంబై పోలీసుల దర్యాప్తును కాదు. మా దర్యాప్తులో కోర్టు ఎటువంటి తప్పిదాన్ని కనుగొనలేదు అని అతను అన్నారు. నగర పోలీసులు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ ‌లో సుప్రీం కోర్టుకు సమర్పించారని తెలిపారు. జూన్ 14 న ముంబైలోని తన ఫ్లాట్ లో రాజ్ పుత్ (34) చనిపోయిన అనంత‌రం ర‌క‌ర‌కాల కోణాల్లో పోలీస్ ద‌ర్యాప్తు సాగిన సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS