• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: మిస్టరీతో...

ట్రైలర్ టాక్: మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా 'ముఖచిత్రం'

By - Tupaki Desk
Update: 2022-12-01 05:45 GMT
వికాస్ వశిష్ట్ - '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు - ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ "ముఖచిత్రం". ఇందులో యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన విశ్వక్ క్యారెక్టర్ కి సంబంధించి గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

రిలీజ్ కు రెడీ అయిన "ముఖచిత్రం" మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఒక మహిళకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత.. ప్లాస్టిక్ సర్జన్ తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిన కథనంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఈ ఇష్యూ సర్జన్ జీవితాన్ని.. చుట్టుపక్కల వారిని ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది చూపించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మహిళగా ప్రియా వడ్లమాని ఇందులో సెంట్రల్ పాయింట్ గా కనిపిస్తుంది. సర్జన్ గా వికాస్ వశిష్ట్.. అతని స్నేహితుడిగా చైతన్యరావు కనిపించారు.

ఇక్కడ లాయర్ విశ్వామిత్రగా విశ్వక్ సేన్ కనిపించాడు. మాస్ కా దాస్ తన కెరీర్ లో తొలిసారిగా నల్లకోటు ధరించి ఆకట్టుకున్నాడు. ట్రైలర్ లో చమత్కారం మరియు ఉత్సాహం యొక్క మూలకం ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఫాస్ట్ కట్ విజువల్స్ తీవ్రతను పెంచుతాయి.

విభిన్నమైన కథ కథనాలతో తెరకెక్కిన ''ముఖచిత్రం'' చిత్రంతో గంగాధర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. ఇందులో అయేషా ఖాన్ - రవి శంకర్ ఇతర పాత్రల్లో కనిపించారు.

SKN సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ - మూవీ మైండ్ స్ బ్యానర్స్ పై ప్రదీప్ యాదవ్ అంగిరేకుల మరియు మోహన్ ఎల్లా సంయుక్తంగా 'ముఖచిత్రం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. పవన్ కల్యాణ్ కొదాటి ఎడిటింగ్ వర్క్ చేశారు.

'ముఖచిత్రం' సినిమాని డిసెంబర్ 9న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగే ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఎప్పుడైనా చూసారా? అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    
  • MukhaChitramMovieTrailer 
  • VishwakSen 
  • VikasVasisht 
  • ChaitanyaRao 
  • PriyaVadlamani 
  • DirectorGangadhar 
  • MukhaChitramTrailer 
  • PradeepAngirekula 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS