• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుండలా ఉన్నావన్నారు.....

కుండలా ఉన్నావన్నారు.. హీరోయిన్‌ ఎమోషనల్

By - Tupaki Desk
Update: 2022-04-24 14:38 GMT
నాని హీరోగా నటించి సూపర్‌ హిట్ అయిన జెర్సీ సినిమాను ఒరిజినల్ వర్షన్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీ లో రీమేక్ చేశారు. నాని పోషించిన పాత్రను హిందీ లో షాహిద్‌ కపూర్ పోషించాడు. ఇక హిందీ జెర్సీ లో షాహిద్ కపూర్ కు జోడీగా మృనాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి జోడీకి మంచి పేరు రావడంతో పాటు సినిమా మంచి కమర్షియల్‌ టాక్ ను దక్కించుకుని దూసుకు పోతుంది.

సినిమా మంచి సక్సెస్‌ అయిన నేపథ్యంలో బాలీవుడ్‌ లో మృనాల్‌ ఠాకూర్‌ పేరు ప్రస్తుతం మారు మ్రోగుతోంది. ఇటీవల జెర్సీ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో ఆమె ప్రముఖంగా కనిపించడంతో సోషల్‌ మీడియాలో ఆమె పేరు... ఫోటోల హడావుడి మామూలుగా లేదు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతున్న మాటలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా మృనాల్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ఆరంభంలో లావుగా ఉన్నావంటూ చాలా మంది నన్ను వెక్కిరించారు. దాంతో నేను బరువు తగ్గడం మొదలు పెట్టారు. ఆ సమయంలో నా ఫేస్ మొదట చాలా చిన్నగా అయ్యి బాడీ పెద్దగానే ఉండేది. ఆ తర్వాత బాడీ పై భాగం సన్నగా అయ్యింది. ఆ సమయంలో నన్ను చాలా మంది మట్కా ( కుండ) లా ఉన్నావంటూ అవహేళన చేశారు.

కుండ ఆకారంలో ఉన్న నీవు సినిమాల్లో నటిస్తావా... నీకు అవసరమా అంటూ విమర్శలు చేశారు. దాంతో నాకు నేను చాలా బాధపడేదాన్ని.. అప్పుడు నా ఫోటోలు బయటకు రానిచ్చేదాన్ని కాదు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేసేదాన్ని కాదు. ఒక సారి నేను అమెరికా వెళ్లిన సమయంలో అక్కడి వారు ఇండియన్ కర్దాషియన్ అంటూ పిలిచారు.

నా అందం గురించి అక్కడి వారు ప్రశంసించడం తో నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. అప్పుడే నేను సోషల్‌ మీడియాలో నా ఫోటోలను షేర్‌ చేయడం మొదలు పెట్టారు. ఎవరో ఏమో అనుకుంటారు అనే ఉద్దేశ్యంతో నేను ఇన్నాళ్లు నన్ను నేను తక్కువగా ఊహించుకున్నాను. ఇక మీదట నాకు నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను అన్నట్లుగా ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాను అంటూ ఎమోషనల్‌ వ్యాఖ్యలు చేసింది. నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్లే నేను ఈ పరిస్థితికి వచ్చాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
Tags:    
  • Mrunal Thakur 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS