రోడ్డెక్కిన సినిమా థియేటర్ కార్మికులు

Update: 2020-05-19 06:00 GMT
ఈరోజు నుంచి దేశంలోని  అన్నింటికి మినహాయింపులు ఇచ్చి తెరిపిస్తున్న ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీపై మాత్రం శీతకన్ను వేశాయి. సినిమా థియేటర్స్ బంద్ కు ఓకే కానీ.. కనీసం షూటింగ్ లకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో సినీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది.

ఇప్పటికే 50 రోజులకు పైగా సినీ కార్మికులు, దానిపై ఆధారపడ్డ వారు పనిలేక పైసలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇన్ని రోజులు బంద్ వల్ల సినిమా రంగంపై ఇది తీవ్ర ప్రభావం పడుతోంది. సినిమా థియేటర్స్ ఇప్పట్లో తెరిచే అవకాశాలు లేక పోవడంతో సినిమా థియేటర్స్ లో పనిచేసే కార్మికులు ఆందోళన బాటపట్టారు.

థియేటర్స్ ఇప్పుడే తెరవరని.. అందువల్ల తమకు పూటగడవడం లేదని.. వెంటనే పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు.

సినిమా థియేటర్ లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. యజమానులపై కఠిన చర్యలు తీసుకొని సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని  కార్మికులు.  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News