సినిమాల గురించి పెయిడ్ పోస్టులు పెడుతున్న సినీ తార‌లు..!

Update: 2020-12-22 17:30 GMT
సినీ సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. అందులోనూ ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో వీరు సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో ప్ర‌మోష‌న్స్ ఓ రేంజ్ లో ఊపందుకున్నారు. అయితే ఈ మధ్య చాలామంది హీరో హీరోయిన్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు బ్రాండ్స్ కి పెయిడ్ ప్రమోషన్స్ చేయడంతో పాటు సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు అందరూ విరివిగా సోషల్ మీడియాను ఉపయోగిస్తుండటంతో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ ఇన్స్టా ట్విట్టర్ లలో పాజిటివ్ రివ్యూస్ వ‌స్తే సినిమాలు హిట్ అనే క‌న్క్లూజ‌న్ కి వ‌చ్చేస్తున్నారట.

ఇక దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న కొంద‌రు కుర్ర హీరోలు, హీరోయిన్లు త‌మ సినిమాల‌తో పాటు మిగ‌తా సినిమాల‌కి కూడా పెయిడ్ ప్ర‌మోట‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉదాహర‌ణ‌లు చాలానే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ పద్ధతిలో విడుద‌లైన 'పెంగ్విన్' సినిమా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అయిందని ఓ హీరో ట్వీట్ చేశాడు. అలానే ఈ మ‌ధ్య విడుద‌లైన 'క‌ల‌ర్ ఫోటో' చిత్రాన్ని ఇండ‌స్ట్రీలోని చాలా మంది కుర్ర హీరోలు ట్వీట్స్ వేసి ప్రమోట్ చేసిన విషయం అంద‌రికి తెలిసిందే. అయితే ఇలా చేయ‌డానికి ఒక్కొక్క‌రికి వారి రేంజ్ ని బ‌ట్టి ఓ పోస్ట్ కి ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌లు వ‌రకు ముట్టజెబుతున్నారని ఇన్సైడ్ టాక్. ఇలా ట్వీట్ల కోసం నిర్మాతలు డ‌బ్బులు క‌డుతున్న ప‌రిస్థితి ప్ర‌స్తుతం చాలా సినిమా ఆఫీసులలో క‌నిపిస్తోందని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News