ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో సినిమాల‌ జాత‌ర

Update: 2021-12-07 23:30 GMT
లాక్ డౌన్ నుంచి ప్రేక్ష‌కుల‌కు ఓటీటీ వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తోంది. థియేట‌ర్ లు రీ ఓపెన్ అయినా స‌రే ఓటీటీల హ‌వా ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. దీంతో థియేట‌ర్ల‌కు ఎందుకులే అని భావించిన నిర్మాతలు కొంత మంది త‌మ చిత్రాల‌ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.

అంతే కాకుండా ఇటీవ‌ల విడుదైన `అఖండ‌` నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌ట విశ్వ‌రూపాన్ని చూపించ‌డం.. థియేట‌ర్ల‌లో శివ తాండ‌వం చేస్తుండ‌టంతో చాలా సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. అందులో కొన్ని పేరున్న చిత్రాలు థియేట‌ర్ల‌లో డిసెంబ‌ర్ 10న శుక్ర‌వారం రిలీజ్ కానున్నాయి.

`అఖండ‌`లో బాయ్య చెప్పిన‌ట్టే త‌న‌కు ఏ సినిమా అడ్డు వ‌చ్చినా బుల్డోజ‌ర్ లా తొక్కిప‌డేసేలా వున్నాడు. అందుకే బాల‌య్య‌కు ఎదురెళ్ల‌డం ఎందుకులే అనుకున్న వారంతా త‌మ చిత్రాల‌ని ఓటీటీకి ఇచ్చేశారు. డిసెంబ‌ర్ 10న ఓటీటీలో.. థియేట‌ర్ల‌లో చిన్న చిత్రాలు.. పేరున్న హీరోలు న‌టించిన చిత్రాలు చాలా వ‌ర‌కు రిలీజ్ కు క్యూ క‌ట్టేశాయి.

ఓ విధంగా చెప్పాలంటే ఈ శుక్ర‌వారం ఓటీటీతో పాటు థియేట‌ర్ల‌లో సినిమా జాత‌ర జ‌ర‌గ‌బోతోందని చెప్పొచ్చు. ప్ర‌తీ శుక్ర‌వారం త‌రహాలోనే ఈ వుక్ర‌వారం కూడా చిన్న చిత్రాల‌తో పాటు పేరున్న చిత్రాలు కూడా పోటీప‌డుతున్నాయి.

ఇందులో ముందుగా వ‌స్తున్న చిత్రం `ల‌క్ష్య‌`. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన చిత్ర‌మిది. `రొమాంటిక్` ఫేమ్ కేతిక‌శ‌ర్మ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని సంతోష్ జాగ‌ర్ల‌మూడి రూపొందించాడు. ఓ ఆర్చ‌ర్ క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంపై హీరో నాగ‌శౌర్య భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

ఈ చిత్రంతో పాటు శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `గ‌మ‌నం` విడుద‌ల కానుంది. శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. సుజ‌న రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఈ చిత్రాన్ని హైద‌రాబాద్ లో సంభివించిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించారు.

ఇక ఈ చిత్రాల‌తో పాటు రోడ్ రేసింగ్ థ్రిల్ల‌ర్ `మ‌డ్డీ` కూడా ఇదే రోజున విడుద‌ల‌వుతోంది. ప్ర‌గ‌భ‌ల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో యువ‌న్‌ కృష్ణ‌, రిధాన్ కృష్ణ‌, సురేష్ అనూష కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు, ఇండియాలో తెర‌కెక్కిన మొట్ట‌మొద‌టి మ‌డ్ రేస్‌ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల‌వుతున్న ఈ మూవీపై అంచ‌నాలు కూడా అదే స్థాయిలో వున్నాయి. ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన బాలీవుడ్ హీరోలు ప్ర‌త్యేకంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ లు పెట్టి మ‌రీ ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఇదే రోజున మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం జీవిత క‌థ ఆధారంగా రూపొందిన`న‌యీం డైరీస్‌` కూడా విడుద‌ల కాబోతోంది. దాము బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో వ‌శిష్ట ఎం. సింహా, నిఖిల్ దేవాదుల న‌టించారు. బుల్లెట్ స‌త్యం, కాఠారి కృష్ణ‌, మ‌న‌పూరి పాండ‌వులు, ప్రియ‌త‌మా వంటి చిన్నా చిత‌క చిత్రాలు కూడా ఇదే రోజు ప్రేక్ష‌కుల ముందుకురాబోతున్నాయి.

ఇందులో కొన్ని థియేట‌ర్ల‌లో సంద‌డికి రెడీ అవుతుంటే మ‌రికొన్ని ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో సినిమాల‌ జాత‌రలో ఎన్ని చిత్రాలు ప్రేక్ష‌కుడిని మెప్పిస్తాయో చూడాలి.
Tags:    

Similar News