మోషన్ పోస్టర్: యూత్ ఫుల్ యాక్షన్ డ్రామాగా 'రౌడీ బాయ్స్'

Update: 2021-04-08 15:00 GMT
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 'రౌడీ బాయ్స్' అనే యూత్ పుల్ ఎంటర్టైనర్ తో ఆశిష్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

రోల్ రైడా పాడే ర్యాప్ సాంగ్ ద్వారా 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ ను చూపించారు. 'మా బాయ్స్ తోటి ఎంట్రీ ఇస్తే అల్ల‌క‌ల్లోలం.. జ‌ర‌ ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్ల‌లం.. ఏం లేక‌పోయినా మ‌స్త్ గా ఉంటాం' అంటూ సాగిన ఈ ర్యాప్ యూత్‌ ను ఆక‌ట్టుకునేలా ఉంది. ఇందులో ఇంజినీరింగ్ - మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్స్.. ఆశిష్ వేరే కాలేజీ అమ్మాయి అయిన అనుపమ పరమేశ్వరన్ కు ప్రపోజ్ చేయడం వంటివి చూస్తుంటే ఇదొక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. మోషన్ పిక్చర్స్ గా వదిలిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

''రౌడీ బాయ్స్'' చిత్రానికి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మధే సినిమాటోగ్రఫీ అందించగా.. మధు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న ఆశిష్ 'రౌడీ బాయ్స్' మూవీతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.
Full View
Tags:    

Similar News