కుర్ర వారసుడిపై కొండంత ఒత్తిడి

Update: 2019-06-22 09:05 GMT
ముందే అనుకున్న టైంకి అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ రిలీజ్ చేసుంటే ఎలా ఉండేదో కాని ఇప్పుడు రెండో సారి రీ షూట్ చేసాక విడుదల కావలసిన టైంలో హీరోతో పాటు యూనిట్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది. కారణం కబీర్ సింగ్. నిన్న విడుదలైన ఈ మూవీకి రివ్యూల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి కమర్షియల్ గా సూపర్ హిట్ వైపు దూసుకుపోతోందని వసూళ్లు చెబుతున్నాయి.

కేవలం మూడు నాలుగు సినిమాల అనుభవం ఉన్న యువ హీరో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను 15 ఏళ్ళ ఎక్స్ పీరియన్స్ ఉన్న షాహిద్ కపూర్ లాంటి సీనియర్ హీరో చేయడం పట్ల తొలుత అనుమానాలు వ్యక్తమైనప్పటికి ట్రైలర్ నుంచే ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు సినిమా వచ్చాక పూర్తి క్లారిటీ వచ్చేసింది

ఇప్పుడు విక్రం వారసుడు ధృవ్ నటించిన రీమేక్ ఆదిత్య వర్మ రిలీజ్ కు రెడీ అవుతోంది. అర్జున్ రెడ్డిని మరిపించడమే కష్టం అనుకుంటే ఇప్పుడు కొత్తగా కబీర్ సింగ్ వచ్చి తోడయ్యింది. తమిళ ప్రేక్షకులకు ఆన్ లైన్ లో అర్జున్ రెడ్డిని ధియేటర్లలో కబీర్ సింగ్ ని చూడటం వల్ల సబ్జెక్టు గురించి యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గురించి పూర్తి అవగాహన ఉంది.

ఇప్పుడు వద్దన్నా పోలికలు వచ్చే తీరతాయి. సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరిసాయ డైరెక్టర్ కాబట్టి ఒరిజినల్ ఫీల్ ని మిస్ కాకుండా తీసుకుంటాడనే టాక్ అయితే ఉంది. మరి విజయ్ దేవరకొండ-షాహిద్ కపూర్ ల రేంజ్ లో అవుట్ పుట్ చూపించాల్సిన బాద్యత లేలేత కుర్రాడైన ధృవ్ మీదుంది. చూడాలి ఎలా నిలబెట్టుకుంటాడో

    

Tags:    

Similar News