సెంథిల్ ని హర్ట్ చేసిన మంగోలియన్స్!
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతికెక్కిన సంగతి తెలిసిందే. జాతీయ ..అంతర్జాతీయ అవార్డులతో పాటు గొప్ప రివార్డులు దక్కించుకుంది. బాహుబలి-1.. బాహుబలి 2 చిత్రాలు సంయుక్తంగా 2600 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో సంచలనం అయ్యాయి. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన ఫ్రాంఛైజీ ఇది. దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో వివిధ భాషల్లో విడుదలై భారతీయ జెండాను అన్ని దేశాల్లోనూ రెప రెపలాడించిన సిరీస్ ఇది. చైనా..తైవాన్ ..సింగపూర్.. మలేషియా.. జపాన్..కొరియా ..అమెరికా ఇలా దాదాపు అన్ని దేశాల్ని బాహుబలి అనువాదం రూపంలో చుట్టేసింది. అయితే ఇప్పుడీ చిత్రం మంగోలియా స్థానిక భాషలో అనువాదమై నేడు రిలీజవుతోంది.
అయితే ఈసినిమా గురించి తెలియని మంగోలియన్స్ ఇది హిందీ చిత్రమని..దానికి డబ్బింగ్ రూపమే ఇక్కడ విడుదలవుతుందని కొన్ని కామెంట్లు పెట్టారు. సినిమా గురించి కూడా కాస్త సెటైరికల్ గా స్పందించారు. అయితే ఈ కామెంట్లు బాహుబలి సినిమాకు కెమెరా మెన్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ దృష్టిలో పడ్డాయి. వెంటనే ఆయన లైన్ లో కి వచ్చారు. దీన్ని తెలుగు సినిమా అనండం..లేకపోతే ఇండియన్ సినిమా అనడం నేర్చుకోండి. అంతే కానీ హిందీ సినిమా అని పిలవొద్దు అంటూ కాస్త సీరియస్ గానే అసలు విషయాన్ని మంగోలియన్లకు వెల్లడించారు. సినిమా గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి అని కాస్త ఘాటుగానే స్పందించారు.
ఇంత గొప్ప తెలుగు సినిమా ఆ దేశంలో విడుదలవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సెంథిల్ తెలిపారు. మరి మంగోలియన్స్ చేసిన ఈ కామెంట్ పై బాహుబలి టీమ్ లో ఇతరులు ఎలా స్పందిస్తారో చూడాలి. రాజమౌళి కూడా దీనిపై స్పందిచే ఛాన్స్ ఉంది. నేడు ప్రపంచంలోనే పలు స్థానిక భాషల్లోకి అనువాదమవుతోన్న చిత్రం కావడం...దాన్ని వాళ్లంతా హిందీ సినిమా అనుకోవడం అంటే తెలుగు వాళ్లకు అవమానమే. అందుకే బాహుబలి టీమ్ కచ్చితంగా స్పందించాల్సిన సమయం అని మర్చిపోకూడదు. సెంథిల్ కుమార్ పర్మినెంట్ గా రాజమౌళి ఆస్థానంలో సినిమాలకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. అరుదుగా మాత్రమే ఆయన బయటి సినిమాలు చేస్తున్నారు.