• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిలీప్ సభ్యత్వ గొడవ.....

దిలీప్ సభ్యత్వ గొడవ.. లాల్ స్పందించాడు

By - Tupaki Desk
Update: 2018-07-01 11:50 GMT
వివాదాస్పద మలయాళ నటుడు దిలీప్ ను మళ్లీ అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ)లోకి తీసుకోవడం.. అతడి సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై మల్లూవుడ్లో  దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దిలీప్ కు మళ్లీ సభ్యత్వం ఇవ్వడాన్ని నిరసిస్తూ కొందరు హీరోయిన్లు ‘అమ్మ’ నుంచి తప్పుకున్నారు. దిలీప్ సభ్యత్వాన్ని ఆమోదించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ మీద విమర్శలు గుప్పించారు. లాల్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన్ని తిట్టిపోస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఐతే ఈ విషయంపై మోహన్ లాల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దిలీప్ సభ్యత్వ పునరుద్ధరణ నిర్ణయం తన ఒక్కడిదే కాదని లాల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న లాల్.. అక్కడి నుంచే ఈ వివాదంపై ఒక ప్రకటన విడుదల చేశారు.

‘అమ్మ’ మహిళా వ్యతిరేకి అన్న ఆరోపణలు సమంజసం కాదని.. సంఘంలో ఏకీకృత విధానాలే అమలవుతుంటాయని లాల్ చెప్పాడు. దిలీప్‌ పై వేటు ఎత్తివేత నిర్ణయం తానొక్కడినే తీసుకోలేదని.. సభ్యులంతా సమీక్షించి తీసుకున్న నిర్ణయం అదని.. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది నిజం కాదని ఆయన స్పష్టంచేశాడు. గత ఏడాది హీరోయిన్ కిడ్నాప్ ఉదంతం బయటికి వచ్చినపుడు మోహన్‌ లాల్‌ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఆడపడుచులంతా తన అక్కచెల్లెళ్లతో సమానమని.. వారికి ద్రోహం జరిగితే చూస్తూ ఉపేక్షించబోనని వ్యాఖ్యానించాడు. ఈ కేసుకు సంబంధించి దిలీప్‌ అరెస్ట్‌ అయిన వెంటనే అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయనే స్వయంగా ప్రకటించాడు. అలాంటిది ఇప్పుడు దిలీప్ జైలు నుంచి బయటికొచ్చి ఆ కేసు పక్కకు వెళ్లిపోగానే నిషేధం ఎత్తివేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో లాల్ ఇలా స్పందించాడు.
Tags:    
  • Mohan Lal 
  • Dileep 
  • Bhavan 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS