రారు అనుకున్న వారిని బాలయ్య రప్పించాడు : మోహన్ బాబు
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమా టైటిల్ కు తగ్గ విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు వసూళ్లను విశ్లేషిస్తూ అంటున్నారు. బాలయ్య మరియు బోయపాటి కాంబో హ్యాట్రిక్ దక్కించుకుంది.
సింహా ను మించి లెజెండ్.. లెజెండ్ ను మించి అఖండ ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ను ఎలా చూపించాలి.. అభిమానులు ఎలా బాలయ్య ను చూస్తే ఊగిపోతారు అనే విషయం బోయపాటికి బాగా తెలుసు. అందుకే బాలయ్య తో బోయపాటి చేసిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. తాజాగా ఈ సినిమాను చూసిన మోహన్ బాబు స్పందించాడు.
అఖండ సినిమా గురించి మోహన్ బాబు స్పందిస్తూ.. కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాక పోవచ్చు.. థియేటర్ ల్లో సినిమాలను జనాలు చూడాలనుకోవడం లేదు అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. జనాలు థియేటర్ కు రారు అనుకున్న వారి కళ్లు తెరిపించేలా నా సోదరుడు బాలకృష్ణ అఖండ సినిమా తో రప్పించాడు.
థియేటర్లకు ప్రేక్షకులను క్యూలు కట్టేలా బాలకృష్ణ చేసి తెలుగు సినిమా పరిశ్రమకు ఊరిపి ఊదాడు. విడుదలకు సిద్దంగా ఉన్న ఎన్నో సినిమాలకు అఖండ నమ్మకంను.. ధైర్యంను కలిగించిన బాలయ్య కు అభినందనలు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి మరియు నటీ నటులకు సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు అంటూ మోహన్ బాబు పేర్కొన్నాడు.
బాలకృష్ణ ను కలిసి మోహన్ బాబు మరియు మంచు విష్ణు లు అఖండ విజయం పై ఆయనకు స్వయంగా అభినందనలు తెలియజేశారు. మోహన్ బాబు అన్నట్లుగా అఖండ విజయం రాబోయే ప్రతి ఒక్క సినిమా మేకర్స్ లో ఉన్న సగం భయంను తొలగించింది. సినిమా ప్రేక్షకులు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటే వసూళ్లు విపరీతంగా వస్తాయని వెళ్లడయ్యింది.
కనుక పాజిటివ్ బజ్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. ఇండస్ట్రీ వర్గాల వారు థియేటర్ రిలీజ్ లు తగ్గుతాయని.. థియేటర్ కు వెళ్లే జనాలు తగ్గుతారని అనుకుంటూ ఆందోళన చెందుతున్న ఈ సమయంలో ఈ విజయం ఖచ్చితంగా అఖండం అంటూ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.